వైసీపీలో భారీ మార్పులు- జగన్ నిర్ణయాలతో
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.
జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. క్యాడర్‌లో ఊపు తెచ్చే నిర్ణయాలను తీసుకుంటోన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వేగంగా కోలుకున్న జగన్..నూతనోత్తేజాన్ని నింపేలా 2.0ను సిద్ధం చేస్తోన్నారు.

అదే సమయంలో పార్టీ పునర్నిర్మాణంపైనా దృష్టి పెట్టారు జగన్. రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కొత్తగా పరిశీలకులను నియమించారు. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు బాధ్యతలను అప్పగించారు. ఈ జాబితాలో పోతిన మహేష్ వంటి నాయకులకు చోటు లభించింది.
శ్రీకాకుళం- ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, విజయనగరం- కిల్లి సత్యనారాయణ, అరకు- బొడ్డేటి ప్రసాద్, అనకాపల్లి- మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, విశాఖపట్నం- మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, కాకినాడ- మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, అమలాపురం- జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి- తిప్పల గురుమూర్తి రెడ్డి నియమితులయ్యారు.
నర్సాపురం- ముదునూరి మురళీ కృష్ణంరాజు, ఏలూరు- ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, మచిలీపట్నం- జెట్టి గురునాథం, విజయవాడ- మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు- పోతిన మహేష్, నరసరావుపేట- డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి, బాపట్ల- ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఒంగోలు- బత్తుల బ్రహ్మానంద రెడ్డి అపాయింట్ అయ్యారు.
నెల్లూరు- మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట రెడ్డి, తిరుపతి - ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, చిత్తూరు - చవ్వా రాజశేఖర రెడ్డి, రాజంపేట- కొత్తమద్ది సురేష్ బాబు, కడప- కొండూరు అజయ్ రెడ్డి, అనంతపురం - మాజీ ఎమ్మెల్సీ బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, హిందూపురం- ఆర్. రమేష్ రెడ్డి, నంద్యాల- ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, కర్నూలు- మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిని నియమించారు.












Click it and Unblock the Notifications