పథకాల లబ్ది దారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!!
ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. జగన్, చంద్రబాబు ప్రజల మధ్యకు వెళ్లారు. కూటమిలో భాగంగా మూడు పార్టీల మధ్య సీట్లు ఖరారయ్యాయి. తాను అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం అస్త్రాలుగా ముందుకు అడుగులు వేస్తున్నారు. తొలి రోజు కడప జిల్లాలో ప్రచారం చేసిన జగన్..రెండో రోజు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. పథకాల గురించి వివరిస్తూనే లబ్ది దారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.
జగన్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావని..పేదల తలరాతలు మార్చేవని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆళ్లగడ్డ నియోజవర్గంలో అక్కడి ప్రజలతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా తాను బటన్ నొక్కటం, నేరుగా లబ్దిదారుల కుటుంబాలకు మేలు జరగటం కొనసాగిందని వివరించారు. ఎక్కడా వివక్ష చూడటం లేదని.. మతం, కులం, పార్టీ అడగటం లేదని చెప్పారు. ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.48,74,34,136 పంపించామన్నారు. ఇది కాక మన ప్రభుత్వం చేస్తున్న నాన్ డీబీటీ పథకాలు కూడా అందించామని వివరించారు.

నేను చాలా చిన్నోడిని
గత పాలకులు తన కంటే పెద్దవాళ్లు, తన కంటే అనుభవం ఉన్న వారుగా జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రం విడిపోయిన తరువాత నాకంటే ముందు 75 ఏళ్ల ముసలాయన పరిపాలన చూశారని జగన్ వ్యాక్యానించారు. ఆయన 14 ఏళ్లు సీఎంగా పని చేశారని... 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయనకు ఉందన్నారు. తాను చాలా చిన్నవాడిని, వయసులో కూడా చిన్ననేనని చెప్పుకొచ్చారు. ఇంత చిన్నొడు చేసిన పనులు ఇదే గ్రామంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తులు మీ గ్రామంలో చేశారా అని నిలదీసారు. అక్కచెల్లెమ్మల్లో సాధికారతకు కృషి చేశాం. విద్యారంగం అభివృద్ధికి ఎంతో చేశామని చెప్పారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు గ్రామాలు బాగుపడ్డాయని వివరించారు. స్కూళ్లు మారాయని, ఇంగ్లీష్ మీడియం కనిపిస్తోందన్నారు.

నగదు జమ అవుతుంది
ప్రతి ఎకరాకు ఈ-క్రాప్, పంటల నష్టపరిహారం అదే సీజన్‌లో ఇస్తున్నామన్నారు. పెట్టుబడి కోసం రైతులకు ఏకంగా రూ.13,500 ఇచ్చింది కూడా వైసీపీ హయాంలోనేనని వివరించారు. వ్యవసాయం మారిందిని.. ఆరోగ్యశ్రీ విస్తరించిందన్నారు. రూ.25లక్షలకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచామని చెప్పారు. ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కానని..ఎన్నికల కోడ్ వస్తుందనే బటన్లు నొక్కామని చెప్పారు. అందరికీ డబ్బులు పూర్తి గా మరో వారం పది రోజుల్లో అందుతాయని జగన్ వెల్లడించారు. గతంలో తనకు ఓటు వేయలేని వారు సైతం ఒక సారి మార్పు చూడాలన్నారు. ఈ సారి తనకు ఓటు వేయాలని జగన్ అభ్యర్దించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications