భారతితో కలిసి జగన్ ప్రార్థనలు: జగనేనని నేతలు
కడప/ ఏలూరు : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శనివారం కడప జిల్లాలోని ఇడుపులపాయలోని తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన తన సతీమణి భారతి ప్రత్యే ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఇడుపులపాయలో జగన్ అక్కడకు వచ్చిన పార్టీ నేతలను, కార్యకర్తలను, అభిమానులను పేరుపేరునా పలకరించారు. అనంతరం జగన్ పులివెందుల బయలుదేరారు. సుదీర్ఘ విరామం తర్వాత జగన్ కడప జిల్లాకు వచ్చారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆయన ఎర్రగుంట్లలో దిగి అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకునేందుకు పోరాడే శక్తి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మాత్రమే ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెల్లంరాజు బాలరాజు, రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏలూరులో వారు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం జగన్ నాయకత్వంలో పోరాటం చేస్తామని వారు చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డి లక్షణాలను జగన్ పుణికి పుచ్చుకున్నారని వారు అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేద్దామని వారు అన్నారు. ఢిల్లీ పీఠాన్ని కదలించైనా సమైక్యాంధ్రను సాధించుకుందామని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications