ఎన్నాళ్లకు: సీబీఐ కోర్టుకు వైయస్ జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైసీపీ అధినేత వైయస్ జగన్ శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం ఆయన ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. కేసు తుది విచారణలో ఉన్నందున ప్రతి శుక్రవారం జరిగే విచారణకు తప్పనిసరిగా తమ ముందు హాజరు కావాలని జగన్‌ను కోర్టు ఆదేశించింది.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష హోదాలో ఉన్న తాను విచారణ నిమిత్తం ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకాలేనన్న జగన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చారు. అయితే తాజా విచారణకు కోర్టుకు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాలతో ఆయన కోర్టుకు వచ్చినట్లు తెలుస్తోంది.

రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజును పరామర్శించిన జగన్

ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 20 నిమిషాలపాటు కృష్ణంరాజుతో జగన్ మాట్లాడారు.

రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజును పరామర్శించిన జగన్

రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజును పరామర్శించిన జగన్

జగన్ వెంట తూర్పుగోదావరి జిల్లా వైసీపీకి చెందిన పార్టీ నాయకులు ఉన్నారు. ఆ సమయంలో కృష్ణంరాజు భార్య మల్లేశ్వరి, చిన్నకుమార్తె కృష్ణకుమారి, కుమారుడు శ్రీనివాసరాజు అక్కడే ఉన్నారు.

రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజును పరామర్శించిన జగన్

రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజును పరామర్శించిన జగన్

కృష్ణంరాజుకు నిమ్స్ కార్డియాలజీ వైద్యులు శేషగిరిరావు, చెస్ట్ డాక్టర్ పరంజ్యోతి, డాక్టర్ జీఎస్‌ఎన్ రాజులు వైద్యమందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YS Jagan attends CBI court on friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X