టిలో సిబిఐ కోర్టుకి హాజరైన జగన్, భారీగా అభిమానులు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టు ఎదుట హజరయ్యారు. ఆస్తుల కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు కేసును జూలై 21వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టు ఎదుట జగన్‌తో పాటు తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు సబితా, ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ, ఆడిటర్ విజయ సాయి రెడ్డిలు హాజరయ్యారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పైన సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సిబిఐ పలు ఛార్జీషీట్లను కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో జగన్, మాజీ మంత్రులు పలుమార్లు కోర్టు ఎదుట హాజరయ్యారు.
కాగా, సోమవారం జగన్ కోర్టుకు వచ్చిన నేపథ్యంలో ఆయనను కలుసుకునేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
ఒఎంసి కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
ఓఎంసి కేసులో ముగ్గురు నిందితులకు సిబిఐ కోర్టు రిమాండు పొడిగించింది. గాలి జనార్ధన్ రెడ్డి, అలీఖాన్, శ్రీనివాస్ రెడ్డిలకు ఈ నెల 21 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సిబిఐ కోర్టుకు హాజరైన దృశ్యం.

ధర్మాన ప్రసాద రావు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టుకు హాజరయ్యారు.

సబితా ఇంద్రా రెడ్డి
మాజీ మంత్రి, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డి సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టుకు హాజరయ్యారు.

సిబిఐ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాఫ్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications