దావుద్ ఇబ్రహీంలా, అన్నీ ఫెయిల్: జగన్‌పై జేసీ దివాకర్ తీవ్ర వ్యాఖ్యలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురువారం మండిపడ్డారు. ఆయన దావుద్‌లా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ

న్యూఢిల్లీ/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురువారం మండిపడ్డారు. ఆయన దావుద్‌లా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వంపై వైయస్ జగన్ చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయని చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని జగన్ కలవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తారన్నారు. జగన్ మధుకొడా, దావూద్ ఇబ్రహీంలా ప్రవర్తిస్తున్నారన్నారు.

YS Jagan behaving like Dawood Ibrahim, JC Diwakar Reddy hot comments

ముఖ్యమంత్రి తలచుకుంటే దారినపోయేవాడిని కూడా మంత్రిని చేయవచ్చునని షాకింగా కామెంట్లు చేశారు. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారని గుర్తు చేశారు.

ఈడీ, సీబీఐ కేసులు వచ్చినప్పుడు జగన్ ఢిల్లీకి వస్తారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం రాష్ట్రపతిని పరేషాన్ చేయడం తప్ప ఒరిగేదేం లేదన్నారు. జగన్ మూర్ఖత్వంతోనే బంధువులు, నేతలు పార్టీని వీడుతున్నారన్నారు.

జగన్ ఢిల్లీ యాత్రకు వచ్చారన్నారు. యాత్రకు వస్తే అన్ని పాపాలు పోతాయనే ఉద్దేశ్యంతో ఢిల్లీ యాత్రకు వచ్చారన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే జగన్‌కు దేవుడు గుర్తుకు వస్తాడని చెప్పారు.

పదవులు వచ్చాక..

పదవులు వచ్చాక పార్టీతో సంబంధం లేదన్నట్లు కొందరు నాయకులు వ్యవహరించడం సరికాదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.

గురువారం అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమవేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. నామినేటెడ్ పోస్టులు తీసుకున్న నాయకులు పార్టీ వ్యవహారాలు మరిచి పోయారన్నారు. అందరి పనితీరును పరిశీలిస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+