జగన్ బిగ్ స్కెచ్ -ప్రస్తుత మంత్రులకు జిల్లాలు, వచ్చేవారికి ఎంపీలు-పీకే సలహా మేరకే ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావొస్తున్నాయి. మరో ఏడాదిన్నర ఆగితే 2024 ఎన్నికల హడావిడి మొదలైపోవడం ఖాయం. ఆ లోపే తదుపరి ఎన్నికల కోసం వ్యూహాలు సిద్దం చేసుకోవాలని వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో రాబోయే మంత్రులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అప్పగింతల కార్యక్రమం ఆసక్తికరంగా మారింది.

జగన్ కేబినెట్ ప్రక్షాళన
గత ఎన్నికల తర్వాత ఏపీ కేబినెట్ కూర్పు సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఓ విషయం స్పష్టం చేశారు. పలు సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మంత్రులుగా తీసుకుంటున్న వారికి రెండున్నరేళ్ల పదవీకాలం మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత వీరి స్దానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్నారు. ఆ హామీ మేరకు ఇప్పుడు డిసెంబర్లో కేబినెట్ ప్రక్షాళనకు జగన్ సిద్దమవుతున్నారు. ఇప్పటికే ప్రాంతాలు, వర్గాలు, రాజకీయాలు, కొత్త, పాత ఇలా వందలాది లెక్కలతో జగన్ రాబోయే కేబినెట్ జాబితా సిద్ధం చేస్తున్నారు. ఎలాగో మంత్రులందరినీ మార్చడం ఖాయమైంది కాబట్టి వచ్చే వారిపైనా ఆసక్తి నెలకొంటోంది. అలాగే డిసెంబర్ లో పదవులు వదులుకునే వారికి అప్పగించే బాధ్యతలపైనా చర్చ జరుగుతోంది.

మంత్రులకు పార్టీ బాధ్యతలు
సీఎం జగన్ తన రాబోయే కేబినెట్ ప్రక్షాళనలో పదవులు కోల్పోతున్న మంత్రులతో పాటు కొత్తగా కేబినెట్ లోకి వచ్చే మంత్రులకు సైతం పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండున్నరేళ్లు పదవులు అనుభవించిన మంత్రులకు ఓ విధంగా, కొత్తగా మంత్రులు కానున్న వారికి మరో విధంగా ఈ బాధ్యతలు ఉండబోతున్నాయి. దీంతో మంత్రులుగా ఎంపిక చేసుకున్న వారందరికీ తమకు ఆ పదవులు రావడానికి కారణమైన పార్టీని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత పెట్టబోతున్నారు. దీంతో మంత్రులకు అప్పగించబోతున్న పార్టీ బాధ్యతలపైనా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఎవరికే ఏ బాధ్యతలు దక్కబోతున్నాయి, వాటికి వారు ఏమాత్రం న్యాయం చేస్తారనే దానిపైనా చర్చ జరుగుతోంది.

ప్రస్తుత మంత్రులకు జిల్లాల బాధ్యత
ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రులు డిసెంబర్ లో మంత్రి పదవులు కోల్పోతారు. వీరంతా పార్టీ సేవకు అంకీతం కావాల్సి ఉంటుందని సీఎం జగన్ ఇప్పటికే వారికి కేబినెట్ భేటీలోనే స్పష్టం చేశేసారు. దీంతో వీరంతా పార్టీ అప్పగించిన బాధ్యతల్లోకి వెళ్లేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు. అయితే వీరికి గతంలో తాము తయారు చేసుకున్న పార్టీ పార్లమెంటరీ జిల్లాల ప్రాతిపదికన బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఈ పార్లమెంటరీ జిల్లాల్లో వైసీపీ గెలుపు బాధ్యతల్ని ఈ మంత్రులు తమ భుజాలపై వేసుకుని తదుపరి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ జిల్లాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధుల గెలుపు బాథ్యత వీరిదే. ఇందుకోసం పార్టీకి ఇప్పటికే ఉన్న ప్రాంతీయ ఇన్ ఛార్జ్ ల కన్నుసన్నల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది.

రాబోయే మంత్రులకు ఎంపీల బాధ్యత
అలాగే డిసెంబర్ లో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో కొత్తగా 25 మంది మంత్రులు రాబోతున్నారు. వీరందరికీ కూడా పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. వీరందరికీ తమ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల గెలుపు బాధ్యతను భూజాలపైకి వేయబోతున్నారు. అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఎంపీల గెలుపు బాధ్యత కాబోయే మంత్రులదే అవుతుంది. ఇందులో వారు విఫలమైతే ఏం చేయాలన్న దానిపై మరో ప్లాన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కాబోయే మంత్రులకు సైతం జగన్ అప్పగించే కొత్త బాధ్యతలు మీద పడబోతున్నాయి. వీరంతా మంత్రులు కావడం తోటే ఆయా ఎంపీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ 2024లో వీరి గెలుపుకు దోహదపడాల్సి ఉంటుంది.

ఎంపీల సూచన మేరకే కొత్త మంత్రులు
డిసెంబర్ లో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో కొత్తగా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై తాజాగా ఎంపీలతో నిర్వహిస్తున్న సమీక్షల్లో జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయా ఎంపీల్ని రేపు 2024 ఎన్నికల్లో గెలిపించాల్సింది వీరే కాబట్టి . వచ్చే ఎన్నికల్లో ఎంపీలు తమను గెలిపించే సత్తా ఉన్న వారినే కాబోయే మంత్రులుగా సిఫార్సు చేయబోతున్నారన్న మాట. దీంతో ఈ వ్యవహారం కూడా వైసీపీలో ప్రస్తుతం ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మధ్య గ్యాప్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రస్తుత మంత్రులు ఎంపీల్ని పట్టించుకోవడం లేదు. చాలా నియోజకవర్గాల్లో వారిని కాలుమోపనీయడం లేదు. ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల ఎంపీల జోక్యాన్ని సహించడం లేదు. దీంతో ఈ సమన్వయం కోసమే ఈసారి ఎంపీలు చెప్పిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ సూచన మేరకే ?
వాస్తవానికి 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అవసరం జగన్ కు లేకుండా పోయింది. కానీ తాజాగా కొంతకాలంగా పార్టీలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరుగుతుండటం, వీరి మధ్య విభేధాలు రేపు 2024 ఎన్నికల్లో వైసీపీ పుట్టి ముంచే ప్రమాదముందన్న సంకేతాలు వస్తుండటం, నిఘా, సర్వే నివేదికల నేపథ్యంలో జగన్.. తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నింటికంటే మించి వచ్చే ఏడాది నుంచి వైసీపీ గెలుపు కోసం మరోసారి రంగంలోకి దిగనున్న ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో విభేధాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోకపోతే ఇబ్బందులు తప్పవన్న పీకే సలహా మేరకే జగన్ ఈ దిశగా అడుగులేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications