తిరుమల లడ్డూ వివాదం వేళ జగన్ కీలక నిర్ణయం..!!

తిరుమల లడ్డూ వివాదం పై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ లక్ష్యంగా లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఈ వివాదం పైన సెట్ ఏర్పాటు చేసారు. ఈ వ్యవహారం పైన ఇప్పటికే ప్రధానికి జగన్ లేఖ రాసారు. ఇదే అంశం పైన పార్టీ నేతలతో చర్చించిన జగన్ పార్టీ నేతలకు తాజాగా కీలక పిలుపునిచ్చారు.

పార్టీ నేతలతో జగన్ తిరుమల లడ్డూ వివాదం పైన చర్చించారు. సీఎం చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో నే తిరుమల లడ్డూ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే విచారణ కోరిన అంశాన్ని పార్టీ నేతలతో జగన్ షేర్ చేసుకున్నారు. ప్రధానికి రాసిన లేఖలోని అంశాలను వివరించారు. ఇక ఇదే సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల పవిత్రతను,స్వామివారి ప్రసాదం విశిష్టతను,వెంకటేశ్వరస్వామి వైభవాన్ని తగ్గించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు.

YS Jagan Call for speical pujas in all temples amid Tirumala laddu row

ఈ సమావేశం తరువాత జగన్ ట్వీట్ చేసారు. అందులో.. టీటీడీ పేరు ప్రఖ్యాతులను,వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులతో పాటుగా ప్రజలంతా ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని కోరారు. చంద్రబాబు తో సహా ఆయన టీం మొత్తం ఉద్దేశ పూర్వకంగానే ఈ ప్రచారం చేస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+