బాబు కార్డులన్నీ హైదరాబాదులోనే, మరి..: జగన్

ఏలూరు: అంతా ఒకటై.. కదంతొక్కుదామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మెడలు వంచైనా రావాల్సింది సాధించుకుందామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్‌ హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జగన్‌ చేపట్టిన రెండు రోజుల రైతు దీక్ష ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.

రుణమాఫీ పెద్ద అబద్ధమని, పంచ పాడవులు.. మంచం కోళ్లు అన్నట్టుగా ఈ తంతు ఉంది అని జగన్‌ అన్నారు. ముందుగా రిజర్వు బ్యాంకుతో మాట్లాడతాం అన్నారని, ఆ తర్వాత సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామన్నారని, ఆ తర్వాత 5 వేల కోట్లు ఇస్తామన్నారని ఆయన అన్నారు. ఇదంతా అయిన తర్వాత రుణమాఫీ కావాలంటే ఆధార్‌ కార్డు ఉండాలన్నారని, ఒక కుటుంబానికి ఒకే మాఫీ అన్నారని, ఇదేనా చంద్రబాబు రుణమాఫీ తీరు అని జగన్ విరుచుకుపడ్డారు.

YS Jagan calls upon to fight against Chandrababu

హైదరాబాద్‌లో ఉన్నవారు రైతులే కాదంటున్నారని, ఇదే చంద్రబాబుకి ఓటరుకార్డు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఇలాంటి చంద్రబాబు సీఎంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం అయితే జాబు వస్తుందన్నారు, 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇప్పుడు వాటి సంగతి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు.

ఇంతకుముందు రైతు రుణ వార్షిక ప్రణాళిక 87,517 కోట్లు ఉండేదని, ఇప్పుడు అది 99,523 కోట్లు అయ్యిందని, అంటే 11,943 కోట్లు రైతులు కొత్తగా అప్పు చేయాల్సి వచ్చిందని, దీనికి బాధ్యుడు చంద్రబాబు కాదా? అని అన్నారు. డ్వాక్రా సంఘాలకు మాఫీకి ముందు 12 వేల కోట్లు రుణం ఉండేదని, ఇప్పుడది 19 వేల కోట్లకు పెరిగిందని, ఇదే తరుణంలో 5 లక్షల సంఘాలు ఉండే డ్వాక్రా గ్రూపులు.. ఇప్పుడు వేళ్లమీద లెక్కించే సంఖ్యకు పడిపోయాయి. వారి రుణాలు రద్దయ్యాయా అని జగన్ దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+