వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అందరిలోనూ అంతర్మధనం; ఎందుకంటే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరంలో భాగంగా ప్రధాన పార్టీల నాయకులు కదనోత్సాహంతో ముందుకు వెళుతున్నారు. అయితే అన్ని పార్టీల నాయకులలోనూ తీవ్ర ఆందోళన కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుంది? ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది? తమ తమ నియోజకవర్గాలలో ప్రజలు తమను ఆదరిస్తారా? లేదా? వంటి అనేక సమస్యలు వారిని నిద్రపోనివ్వటం లేదు.

అధినేతలను వేధిస్తున్న సమస్యలు
ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను సైతం ఎన్నికలకు సంబంధించిన కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. ఎన్నికలలో ఓటు బ్యాంకు ఆందోళన ఇప్పటి నుండే కనిపిస్తుంది.

YS Jagan Chandrababu Pawan Kalyan everyone facing new tension now because

చంద్రబాబు ఆందోళన ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు టిడిపి, జనసేన, బిజెపి పొత్తులతో వెళుతున్న క్రమంలో, బిజెపి వల్ల టిడిపి ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందేమో అన్న అంతర్మథనంలో చంద్రబాబు ఉన్నారని సమాచారం. బిజెపి మీద వ్యతిరేకత తమకు ఎక్కడ తగులుతుందోనన్న ఆందోళన ఆయనను వెంటాడుతున్న టు తెలుస్తుంది. ఇదే సమయంలో టికెట్లు దొరకని, పక్కపార్టీలలో చేరిన నేతల ఎఫెక్ట్ వివిధ నియోజకవర్గాలలో ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన కూడా చంద్రబాబును వేధిస్తుందని సమాచారం.

పవన్ కళ్యాణ్ కూ కొత్త టెన్షన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా పొత్తుల విషయంలో అంతర్మథనం కొనసాగుతుంది. జనసేన పార్టీకి ఈసారి కాపుల పూర్తి మద్దతు దొరుకుతుందా లేదా అన్నది నా ఆందోళన. కాపు ఓటు బ్యాంకు కోసం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ కళ్యాణ్ ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి.

నిద్ర పోలేకపోతున్న పవన్ కళ్యాణ్
ఇక మూడు పార్టీలు కలసికట్టుగా పోటీ చేస్తున్న వేళ ఓట్ల బదలాయింపు ఏ విధంగా ఉంటుంది. జనసేన నుంచి టికెట్టు రానివారు చూస్తున్న పరిస్థితులతో వారి వల్ల జనసేనకు ఎంత నష్టం జరగబోతుంది అన్నది పవన్ కళ్యాణ్ ను నిద్ర పోనివ్వడం లేదు. గత ఎన్నికల్లో చావు దెబ్బ తగిలిన జనసేన ఈసారైనా కోలుకుంటుందా అన్నది పవన్ కళ్యాణ్ కు ఉన్న పెద్ద ప్రశ్న.

జగన్ కు అంతుచిక్కని ఆందోళన
ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎన్నికలకు వెళుతున్నా, ఆయనకు వైయస్ షర్మిల టెన్షన్ పట్టుకుంది. వైయస్ షర్మిల ప్రభావం వచ్చే ఎన్నికలలో ఏ విధంగా ఉండబోతుంది? అది వైసిపి ఓటు బ్యాంకును తెలుస్తుందా లేక టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి ఓటు బ్యాంకును పంచుకుంటుందా? అన్నది తెలియటం లేదు. షర్మిల ఎవరి ఓటు బ్యాంకును పంచుకుంటుంది అనేది ప్రస్తుతం జగన్ కు అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. అలాగే పార్టీ వీడి వెళ్ళిన వారి వలన ఎంత నష్టం కలిగే అవకాశం ఉందన్నది కూడా తెలియకుంది. ఈ క్రమంలోనే ఎవరికివారు అంతర్మథనంలో ఉన్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+