ఏపీలో ముందస్తు ఎన్నికలు ? మంత్రులకు క్లారిటీ ఇచ్చేసిన జగన్..
ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికల కోసమే వరుసగా ఢిల్లీలో పర్యటిస్తున్నారని, కేంద్రంలో పెద్దలతో దీనిపై మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కేంద్రంలో పెద్దలు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలకు ఓకే చెప్పేశారని కూడా రూమర్లు వచ్చాయి. దీనిపై ఇవాళ కేబినెట్ భేటీలో నిర్ణయం ఉంటుందని కూడా అంతా అనుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపై బయట జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మంత్రులకు కూడా క్లారిటీ వచ్చినట్లయింది. ఎన్నికలకు ఇంకా ఎంతకాలం మిగిలి ఉంది, ఈ కాలంలో వారు చేయాల్సిందేంటి అన్న దానిపైనా జగన్ స్పష్టత ఇచ్చారు.

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్ ఇవాళ మంత్రులకు స్పష్టత ఇచ్చేశారు. ఎన్నికలకు ఇంకా మిగిలి ఉన్నది 9 నెలలేనన్న జగన్... ఈ 9 నెలలు కష్టపడితే గెలుపు మనదేనన్నారు. తొమ్మిది నెలల పాటు కష్టపడండి.. మిగిలినది నేను చూసుకుంటానంటూ మంత్రులతో జగన్ వ్యాఖ్యానించారు. దీంతో మంత్రులు కూడా సీఎం జగన్ మాటలకు సరేనన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు ఇక చెక్ పడినట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications