అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడు మన పరిస్థితేంటి, బీకాంలో ఫిజిక్స్ చేస్తే నా లెక్కలు అర్థంకావు: జగన్

హైదరాబాద్‌కు దూరమైన తర్వత మన పరిస్థితి ఏమయిందని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం సభలో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: హైదరాబాద్‌కు దూరమైన తర్వత మన పరిస్థితి ఏమయిందని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం సభలో మాట్లాడారు.

'కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడిపిలో చేరుతారు చూడండి''కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడిపిలో చేరుతారు చూడండి'

పది శాతం వృద్ధి రేటు అంటున్నారని, అంత ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. టిడిపి ప్రభుత్వానికి అయిదేళ్ల పాటు అధికారం ఇస్తే వీళ్లు మాత్రం 2050 వరకు లక్ష్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

విభజన తర్వాత అభివృద్ధిలో దూసుకు పోతున్నామని చెబుతున్నారని విమర్శించారు. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రల కంటే ముందున్నామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వృద్ధిరేటు దైవ రహస్యం అన్నారు.

అది దైవ రహస్యం

అది దైవ రహస్యం

వృద్ధి రేటు అనేది దేవ రహస్యం అన్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిందే మూడేళ్లుగా చెబుతున్నారన్నారు. పడికట్టు పదాలతో మభ్యపెడుతున్నారన్నారు. రొటీన్‌గా జరుగుతున్న అభివృద్ధినే భూతద్దంలో చూపిస్తున్నారన్నారు.

ఏది అభివృద్ధి

ఏది అభివృద్ధి

రాష్ట్రంలో అక్వా రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని చెబుతున్నారని, కానీ అంతకుముందే 28 శాతం అభివృద్ధి ఉందని తెలిపారు. రాష్ట్రంలో అక్వా రంగంలో అబివృద్ధి పడిపోయిందన్నారు.

నా లెక్కలు బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు అర్థం కాదు

నా లెక్కలు బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు అర్థం కాదు

జగన్ ప్రసంగంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు తన లెక్కలు అర్థం కావని చెప్పారు.

బీంకాంలో ఫిజిక్స్ చదివినట్లు జలీల్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. జగన్ ఇంకా మాట్లాడుతూ.. రెయిన్ గన్స్‌తో ఒరిగిందేమీ లేదని చెప్పారు. టిడిపి హయాంలో పంటలకే కాదు, చేపలకు కూడా మద్దతు ధర లేదన్నారు.

జగన్ కన్ఫ్యూజ్ అవుతూ... వైసిపి తాత్కాలికం: యనమల

జగన్ కన్ఫ్యూజ్ అవుతూ... వైసిపి తాత్కాలికం: యనమల

అక్వా రంగంలో ఎగుమతులు పడిపోయాయన్న జగన్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. అక్వా రంగంలో ఎగుమతులు పెరిగాయంటూనే, పడిపోయాయని జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ కన్ఫ్యూజ్ అవుతూ మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు. ఈ అసెంబ్లీ తాత్కాలికం కాదని.. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే తాత్కాలికం అని యనమల అన్నారు.

జగన్ స్పీచ్‌కు అడ్డు, విపక్షాల నిరసన

జగన్ స్పీచ్‌కు అడ్డు, విపక్షాల నిరసన

ఓ సమయంలో జగన్ ప్రసంగాన్ని టిడిపి సభ్యులు అడ్డుకున్నారు. జగన్ 62 నిమిషాలు మాట్లాడారని, ముగించాలని స్పీకర్ కూడా సూచించారు. జగన్ స్పీచ్‌కు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రెండుసార్లు అడ్డు తగిలారు. మంత్రి పల్లె కూడా అడ్డు తగిలారు. మొత్తంగా జగన్ స్పీచ్‌కు ఆరుసార్లు టిడిపి సభ్యులు అడ్డు తగిలారు. విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో జగన్‌కు మాట్లాడేందుకు

తెలంగాణకు హైదరాబాద్... ఐటీ రంగంలో వెనుకబాటు..

తెలంగాణకు హైదరాబాద్... ఐటీ రంగంలో వెనుకబాటు..

ఐటీ రంగంలో మనం వెనుకబడుతున్నామని జగన్ అన్నారు. కర్నాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు గ్రహ బలం ఏమిటో కానీ చేపలకు కూడా మద్దతు ధర లభించడం లేదన్నారు. అనంతరం సభ 13వ తేదీకి వాయిదా పడింది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy comments on MLA Jaleel Khan in Andhra Pradesh Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X