వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాహుబలి డైజైన్లై అమరావతి, అయ్యా.. ఏమైంది: రాజమౌళి, పవన్‌లపై జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

బాబుకు రాజమౌళి థ్యాంక్స్ : టవర్‌ ఆకృతి కి ఎక్కువ వోట్లు !

అనంతపురం: వైయస్సార్ర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ధ్వజమెత్తుతూ రాజమౌళి, పవన్ కల్యాణ్‌లకు చురకలు అంటించారు. సినిమా యాక్టర్లను, డైరెక్టర్లను చంద్రబాబు పక్కన పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.

బుధవారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా, అనంతపురం జిల్లా రాప్తాడు చేరుకొన్న ఆయన, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పాలన మోసాలు, అబద్ధాలతో సాగుతోందని, అధికారంలోకి రావడానికి ఎన్నోమాటలు చెప్పి, ఏ ఒక్కటీ నెరవేర్చలేదుని అన్నారు.

బంగాళాఖాతంలో చంద్రబాబు

బంగాళాఖాతంలో చంద్రబాబు

మనలో చైతన్యం వస్తేనే, చంద్రబాబులాంటి వాళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతారని జగన్ అన్నారు. చంద్రబాబు ఏమిచేయకపోయినా చేసినట్లు యాక్టర్లు, డైరెక్టర్లు చెప్పుకొస్తారన ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చాలా కష్టపడుతున్నాడని, కేంద్రమే సహకరించలేదని చెబుతారని అన్నారు.

అమరావతిపై సినిమా తీయాలని..

అమరావతిపై సినిమా తీయాలని..


ఇటీవలే బాహుబలి డైరెక్టర్‌ను చంద్రబాబు పిలిపించుకున్నారని, ఒక్క ఇటుక కూడా పడని అమరావతిపై సినిమా తీయాలని చెప్పారని, అందులో తన పాత్ర, మంత్రి నారాయణ పాత్రను బాగా చూపించమని అడిగారని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ముందుకొచ్చే యాక్టర్లను నిలదీయాలని పరోక్షంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కూడా వ్యాఖ్యానించారు. విలేజ్‌మాల్స్‌ పేరుతో ప్రజలను మరింత మోసం చేస్తున్నారని ఆరోపించారు.

బాహుబలి సెట్టింగులతో అమరావతి

బాహుబలి సెట్టింగులతో అమరావతి

బాహుబలి సినిమాలాగే సెట్టింగ్‌లు వేసేసి అమరావతిని సృష్టించేస్తారని, ఒక్క ఇటుక కూడా వాడకుండా బ్రహ్మాండంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారని ఆయన జగన్ చెప్పారు. చంద్రబాబు చాలా కష్టజీవి అని, కేంద్రమే సహకరించడం లేదని యాక్టర్లు, డైరెక్టర్లు చెబుతారని అన్నారు. ఇందులో మంత్రి నారాయణది మరోపాత్ర.. అదిగో అమరావతి వచ్చేసింది అంటారు.. ఏ మోసానికైనా హద్దూపద్దూ ఉండాలని అన్నారు.

 ప్రతిదాన్నీ నాశనం చేశారు...

ప్రతిదాన్నీ నాశనం చేశారు...

గత ఎన్నికల మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్నీ సర్వనాశనం చేశారని జగన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తన పబ్బం గడుపుకునేందుకు సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను చంద్రబాబు వెంటబెట్టుకుని వస్తారని అంటూ వాళ్లను చూసి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో చిన్నచిన్న మోసాలు చేసి బాబు నమ్మించారని, వచ్చే ఎన్నికల్లో పెద్దపెద్ద మోసాలు చేసేందుకు వస్తున్నారన్నారు. ఇంటింటికీ కిలో బంగారం, ఓ కారు ఇస్తామని అంటున్నట్లు వ్యాఖ్యానించారు.

 అయ్యా, అందులో నీ వాటా లేదా...

అయ్యా, అందులో నీ వాటా లేదా...

గత ఎన్నికల్లో ఇలాగే చంద్రబాబుకు మద్దతిచ్చారు.. ఏమైంది.. రాష్ట్రంలో అన్నీ మోసాలే.. అయ్యా యాక్టర్ గారూ.. చంద్రబాబు ఇన్ని మోసాలు చేస్తే.. అందులో నీ వాటా లేదా అని ప్రశ్నించాలని జగన్ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.

English summary
Continuing his verbal attack on Andhra Pradesh CM Nara Chandrababu Naidu, YSR Congress president Jagan made comments against Rajamouli and Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X