జగన్ ఓదార్పు: ఫ్యాన్ తిప్పిన షర్మిల, కౌగిలిలో(పిక్చర్స్)

అనంతపురం: తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంతకాలతో రాష్ట్ర దిశను మారుస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తొలి సంతకం.. తల్లిఒడి పథకం ఫైలుపై చేస్తానని అన్నారు.

వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ను మొత్తాన్ని పెంచుతానని చెప్పారు. రైతులకు మద్దతు ధర, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుపేదలకు ఏటా రూ. 10 లక్షల ఇళ్లు తదితర హామీలను నెరవేరుస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకేమి చేయలేదని, ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు విశ్వసనీయత అంటే ఏంటో తెలియదని అన్నారు.

ఇది ఇలా ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి, గోపాలపురం నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పథకాలతో పాటు మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాల్లో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో ఓటు వేసే ముందు దివంగత నేత వైయస్సార్‌ను గుర్తు చేసుకోవాలని కోరారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి

వృద్ధురాలికి ఓదార్పు

వృద్ధురాలికి ఓదార్పు

వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ను మొత్తాన్ని పెంచుతానని జగన్ చెప్పారు. రైతులకు మద్దతు ధర, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుపేదలకు ఏటా రూ. 10 లక్షల ఇళ్లు తదితర హామీలను నెరవేరుస్తామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర దిశను మారుస్తా..

రాష్ట్ర దిశను మారుస్తా..

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంతకాలతో రాష్ట్ర దిశను మారుస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

విజయమ్మ రోడ్‌షో

విజయమ్మ రోడ్‌షో

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి, గోపాలపురం నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహించారు

సంక్షేమ రాజ్యం

సంక్షేమ రాజ్యం

తాము అధికారంలోకి వస్తే దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పథకాలతో పాటు మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అన్నారు.

ఫ్యాన్ తిప్పిన షర్మిల

ఫ్యాన్ తిప్పిన షర్మిల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను చూపిస్తున్న దృశ్యం.

వృద్ధురాలిని కౌగిలించుకుని..

వృద్ధురాలిని కౌగిలించుకుని..

బుధవారం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాల్లో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలిని కౌగిలించుకుని ఓదారుస్తున్న షర్మిల.

షర్మిల ప్రసంగం

షర్మిల ప్రసంగం

బుధవారం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాల్లో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటు వేసే ముందు దివంగత నేత వైయస్సార్‌ను గుర్తు చేసుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+