ఇక పోరాటం ఆరంభం, ఇదే జరిగేది - జగన్ కీలక ప్రకటన..!!
పార్టీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ దిశా నిర్దేశం చేసారు. ఇంత చేసిన తరువాత ఇలాంటి ఫలితాలు చూసి బాధ కలిగిందన్నారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఇంటర్వెల్ గా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గాయపడ్డ ప్రతీ కార్యకర్తను కలుస్తానని..ప్రజలతోనే ఉంటానని జగన్ స్పష్టం చేసారు. చంద్రబాబుకు కేంద్రంలో అవకాశం ఉన్నా..హోదా గురించి మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు.
ఇలా ముందుకెళ్దాం
అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో శకుని పాచికలు మాదిరి పరిస్థితి కనిపించిందని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులతో జగన్ సమావేశమయ్యారు. శకుని పాచికలు అనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెలేనని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు తోడు ఉన్నా.. పాండవులు ఓడిపోతారని వ్యాఖ్యానించారు. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేమని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్ని కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో తాను కార్యకర్తలను కలుసుకుంటానని చెప్పారు.

ప్రతీ కార్యకర్తను కలుస్తా
నష్టపోయిన ప్రతి కార్యకర్తనూ కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తానని జగన్ స్పష్టం చేసారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వాలని సూచించారు. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారన్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి సమావేశాలు నిర్వహించాలని జగన్ పార్టీ నేతలకు నిర్దేశించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు సగానికిపైగా అక్కచెల్లెమ్మలు ఉన్నారని చెప్పుకొచ్చారు. 1500 లు ప్రతి ఒక్కరికీ ఇస్తానని చెప్పారని గుర్తు చేసారు.
ప్రజల మధ్యే ఉందాం
ఇందులో పెన్షన్లు తీసుకునేవాళ్లని పక్కనిపెట్టినా సరే.. మిగిలిన 1.8 కోట్లమంది ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సహాయంకోసం రైతులు, అమ్మ ఒడిగా కింద వచ్చే డబ్బులు కోసం తల్లులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. కాలం గడుస్తున్నకొద్దీ.. హనీమూన్ పీరియడ్ ముగిస్తుందని చెప్పారు. 2019 కంటే 10 శాతం ఓట్లు తగ్గాయని..ఎవరైతే దూరమయ్యారో, వారిని తిరిగి దగ్గర చేసుకొనేలా నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చారు. తాను రానున్న రోజుల్లో ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేసారు. సభలో పార్టీకి ఉన్న సంఖ్యా బలంతో మాట్లాడే అవకాశం ఉండదని..ప్రజల నుంచే ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications