ఎన్డీఏకి జగన్‌ జై, 2019 ఫార్ములా రిపీట్ - ఢిల్లీలో కీలక పరిణామాలు..!!

ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దం అవుతోంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలే కాకుండా.. తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఫార్ములా రిపీట్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. తాజాగా కేంద్రంలోని ముఖ్య నేతలు జగన్ తో సంప్రదింపులు చేసారు. జగన్ సైతం సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ అభ్యర్ధనతో
ఢిల్లీలో తిరిగి రాజకీయ వేడి పెరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తటస్థ పార్టీల అధినేతలతో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు మొదలు పెట్టింది. ఎన్డీఏ కూటమి ఇప్పటికే రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా ప్రకటించింది. అటు ఇండియా కూటమి తమ అభ్యర్ధిని పోటీకి దింపే ఆలోచన చేస్తోంది. తమిళనాడుకు చెందిన ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది. ఈ రోజు తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కు బీజేపీ అగ్ర నేత రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్‌ చేశారు. ఎన్‌డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్‌, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను రంగంలోకి దింపుతున్నామని, ఆయన్ను బలపరచాలని జగన్‌ను కోరారు. ఇందుకు మాజీ సీఎం సానుకూలంగా స్పందించారు.

ys-jagan-decided-to-support-nda-in-vice-president-elections-as-bjp-request

ఎన్డీఏకు మద్దతు
ఇప్పటికే జగన్ కొద్ది తన వ్యూహాలు మార్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక కసరత్తు ప్రారంభం వేళ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నేత రాహుల్ ను టార్గెట్ చేసారు. దేశ వ్యాప్తంగా ఓట్ల వివాదం పైన మాట్లాడుతున్న రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడారని నిలదీసారు. రాముల్ - చంద్రబాబు - రేవంత్ హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని విమర్శించారు. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అయినా, ఏపీలో ఓట్ల వివాదం పైన మాత్రం స్పందించలేదు. ఇదే సమయం లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. సీఎం చంద్రబాబు లక్ష్యంగానే జగన్ విమర్శలు చేస్తున్నారు. 2014-19 కాలంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నా.. 2018 లో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయ.

కీలక మలుపు
ఇక, 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తరువాత ఒక్క సారిగా సీన్ మారిపోయింది. ఎన్డీఏ అధికారిక భాగస్వామి కాకపోయినా.. అవసరమైన అన్ని సందర్భాల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో టీడీపీ జత కట్టింది. జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇక.. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల వేళ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్ధిని గెలిపించు కోవటానికి ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. అయితే, భవిష్యత్ సమీకరణాల్లో భాగంగా తటస్థ పార్టీలను ఇండియా కూటమి వైపు వెళ్లకుండా ఎన్డీఏ నేతలు వ్యవహరిస్తున్నారు. జగన్ సైతం తాను ఎన్డీఏ కే మద్దతిస్తానని చెప్పటం ద్వారా.. ఏపీలో చంద్రబాబు, పవన్ ను ఫిక్స్ చేసేలా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు.. మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏకు జై కొట్టటం ద్వారా.. ఏపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+