మా ఎంపీల ప్రాణాలు, ఏపీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది: జగన్

Recommended Video

    ప్రత్యేక హోదాపై ఇచ్చిన హమీని నిలుపుకోవాలి : జగన్

    అమరావతి: ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న తమ పార్టీ ఎంపీల ఆరోగ్యాలు క్షీణించాయని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో చేసిన హమీని నిలుపుకోవాలని జగన్ ప్రధాన మంత్రి మోడీని కోరారు.

    వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6వ తేది నుండి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగంణంలో ఆమరణ నిరహరదీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో ఉన్న ఎంపీల ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలను ఆసుపత్రికి తరలించారు.

    నాలుగు రోజులుగా ఎంపీలు దీక్షలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీల జీవితాలు, ఏపీ భవిష్యత్ ఆందోళనలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హమీని నిలుపుకోవాలని వైఎస్ జగన్ ప్రధానమంత్రిని కోరారు.

    Ys jagan demands to announce special status to Ap state

    సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా జగన్ ప్రధానమంత్రిని ఈ మేరకు కోరారు.ప్రత్యేక హోదా కోరుతూ తమ పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన గుర్తు చేశారు.

    దీక్షలో ఉన్న ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వర ప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిల ఆరోగ్యం క్షీణించిందన్నారు. వైద్యుల సూచన మేరకు రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని ట్విట్టర్‌లో వైఎస్ జగన్ ప్రస్తావించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+