రేవంత్ చిక్కు: బాబుఏ1, తెలంగాణతో ఏంపని: జగన్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగతే చంద్రబాబుకు అంత ఆరాటం ఎందుకని ప్రశ్నించారు.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ఇచ్చారంటే 18 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇష్యూలో చంద్రబాబు పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగన్ నేతృత్వంలో వైసీపీ గవర్నర్ నరసింహన్‌ను కలిసింది. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో జరిగిన ఎన్నికలతో చంద్రబాబుకు ఏపీలో వచ్చే నష్టమేమీ లేదని, అయినా అంత ఆరాటం ఎందుకని ప్రశ్నించారు. అక్కడ టీడీపీ గెలిచినా గెలవకున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో పడిపోదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వేరే రాష్ట్రమని చెప్పారు.

వేరే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం లేకపోగా పోటీకి పెట్టి, విచ్చలవిడిగా డబ్బులతో రాజకీయం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారని, బాస్ అంటూ చెప్పారని, అలాంటప్పుడు చంద్రబాబు పైన కేసు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
రేవంత్ పదేపదే బాస్ అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిస్తానని కూడా చెప్పారన్నారు. రూ.50 లక్షలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారన్నారు. కరప్షన్ ఏ స్థాయిలో ఉందో చూడాలని తాము గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. నోటుకు వోటు వ్యవహారంలో చంద్రబాబుపై కేసు పెట్టాలన్నారు.
సూత్రదారులను అరెస్టు చేయాలన్నారు. దీనిపై చంద్రబాబు రాజకీయ కుట్ర అంటారని, కానీ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అసలు చంద్రబాబుకు అంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలన్నారు. ఇష్టమైన వారికి ప్రాజెక్టులు అప్పనంగా కట్టిబెడుతున్నారని ఆరోపించారు.
సమైక్యాంధ్ర కోసం తాము నాడు చిత్తశుద్ధితో పోరాటం చేశామని చెప్పారు. తాము ఒక్కరమే ధైర్యంగా పోరాడామన్నారు. విభజన పైన చంద్రబాబు తెలంగాణలో ఓ మాట, ఏపీలో మరో మాట చెబుతున్నారని ఆరోపించారు. అది బాబుకు అలవాటే అన్నారు.
రేవంత్ ఇష్యూలో చంద్రబాబును ఏ1గా చేర్చాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వరకే తమ మద్దతు తెరాసకు అన్నారు. ఆ తర్వాత వారి పైన పోరాటం చేస్తామని చెప్పారు. తెరాసకు మేం మద్దతిస్తే బాబుకు అభ్యంతరమేమిటన్నారు. ఓ వైపు నిధుల కోసం ఆరాటపడుత, మరోవైపు అధిక మొత్తానికి కాంట్రాక్టులు ఇవ్వడం విడ్డూరమన్నారు.
-
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు











Click it and Unblock the Notifications