అవినీతిలో జగన్ డాక్టరేట్, రఘువీరా మాస్టర్ డిగ్రీ: అనురాధ
విజయవాడ/ తిరుపతి: అవినీతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి డాక్టరేట్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి మాస్టర్ డిగ్రీ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీలో రఘువీరారెడ్డి ఒక్కరే మిగులుతారని ఆమె అన్నారు.
సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులకు అలవాటు పడి కేసుల్లో ఇరుక్కున్నది తల్లి, పిల్ల కాంగ్రెస్ నేతలేనని ఆమె విమర్శించారు. కాంగ్రెస్‌లో రఘువీరా రెడ్డి అంటే ఎవరికీ తెలియదని, మేఘమథనం రెడ్డి అంటే తెలుస్తుందని ఆమె అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కుమ్మక్కై కాంగ్రెస్ పిచ్చి కూతలు కూస్తోందని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. ప్రసంగాలు వినేవారు లేకున్నా కాంగ్రెస్ బ్యాచ్ టీవీల ముందు విర్రవీగుతోందని, అబద్ధాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు ఏర్పడిన సమయంలో కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని, అప్పుడు గవర్నర్ కూడా నిద్రావస్థలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఏడాది క్రితమే అంత్యక్రియలు జరిగాయన్న విషయం ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications