జగన్‍‌కు అంత ఖర్మ పట్టలేదు, మీకు ఆ అధికారం ఉందిగా: బాబుకు వైసిపి ఎంపీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు తనకు దక్కలేదనే వైసిపి అధినేత జగన్ కుట్ర పన్నుతున్నారన్న టిడిపి నేతలకు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి శనివారం ధ్వజమెత్తారు.

దిమ్మతిరిగే షాక్: యాత్రకు ముందు జగన్‌కు కొత్త అస్త్రాన్ని అందించిన రేవంత్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మొదటి నుంచి వైసిపి నిలదీస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టా, కాదా చెప్పాలని నిలదీశారు.

YS Jagan dont want projects: YV Subba Reddy

కాంట్రాక్టర్లు సరిగా పని చేయకుంటే వారిని టెర్మినేట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, సమయాన్ని వృథా చేసేందుకు కేంద్రమంత్రులను సీఎం చంద్రబాబు కలుస్తున్నారన్నారు.

విదేశీ పర్యటనకు ముందు చంద్రబాబు ఆగమేఘాల మీద కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారన్నారు. ఎవరిని కాపాడటం కోసం కలిశారో చెప్పాలన్నారు. వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందన్నారు.

బాబుకు షాక్ మీద షాక్: రేవంత్ తర్వాత ఉమామాధవ రెడ్డి, హామీ వచ్చింది?

కాంట్రాక్టర్ల పేరు చెప్పి మూడేళ్లుగా సబ్ కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారన్నారు. పోలవరం పనుల్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు.

జగన్‌కు ప్రాజెక్టులు తీసుకునేంత ఖర్మ పట్టలేదన్నారు. కేవలం కమిషన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చేపట్టిందన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టే కాదు, మరే ఇతర ప్రాజెక్టులో కూడా తాను పనులు చేయలేదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress party MP YV Subba Reddy on Saturday said that YSR Jaganmohan Reddy did not takeup any projects.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి