చంద్రబాబు స్కిల్ స్కాం చేశారిలా..! అసెంబ్లీలో బయటపెట్టిన జగన్-పవన్ ప్రశ్నించరా..?

ఏపీలో టీడీపీ హయాంలో సాగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ఎల్లో మీడియా కానీ, దత్తపుత్రుడు కానీ నోరు మెదపలేదని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.

అమరావతి : ఏపీలో టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై అసెంబ్లీలో ఇవాళ సుదీర్ఘ చర్చ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ స్కాంపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. అనంతరం సీఎం జగన్ దీనిపై మాట్లాడారు. ఇందులో ఆయన ఈ స్కాం ఎలా సాగిందో పూర్తిగా వివరించారు. ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర, స్కాం జరిగిన విధానంపై అసెంబ్లీకి సీఎం జగన్ పూర్తి వివరాలు ఆధారాలతో సహా వెల్లడించారు.

దేశచరిత్రలోనే పెద్ద స్కాం

దేశచరిత్రలోనే పెద్ద స్కాం


చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కాం.. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కాం అని సీఎం జగన్ అభివర్ణించారు. స్కిల్లింగ్ పేరుతో డబ్బులు దోచుకోవడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య అన్నారు. ఏ విధంగా ఓ వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తూ అడుగులు ఎలా పడ్డాయో ప్రజలకు తెలియాలన్నారు. వందరూపాయలు పనిచేస్తానని చెప్పి పది రూపాయలు అడ్వాన్స్ తీసుకుని, దాన్ని కూడా దోచుకున్న వ్యవహారం ఇది అని జగన్ ఆరోపించారు.

అమెరికా లాటరీ తరహా మోసం ఇది అని జగన్ తెలిపారు. ఈ స్కాం నడిపిన వ్యక్తి సాక్ష్యాత్తూ అప్పటి సీఎం చంద్రబాబేనన్నారు.ప్రభుత్వ ధనం 371 కోట్లు హారతికర్పూరంలా మాయమైపోయిందన్నారు. ఈ డబ్బు వివిధ షెల్ కంపెనీలకు రూటింగ్ చేసి తిరిగి వాటి నుంచి చంద్రబాబుకు వచ్చిందన్నారు. ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం అని విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఇది అన్నారు. కేబినెట్లో ఒకటి చెప్పి, దాని మేరకు జీవో ఇచ్చి, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఓ ఎంఓయూ చేసుకున్నారన్నారు. చంద్రబాబు చాతుర్యం చూడాలంటే ఈ స్కామే నిదర్శనమన్నారు. జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ వంటి ఏజెన్సీలన్నీ ఈ స్కాంపై దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు.

స్కాం జరిగిన విధానమిదీ..

స్కాం జరిగిన విధానమిదీ..

ఈ దోచేసిన సొమ్ము విదేశాలకు, తిరిగి దేశంలోకి తెచ్చి, అక్కడి నుంచి చంద్రబాబు నివాసం ఉన్న హైదరాబాద్ కు తరలించారని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు, ఆయన మనుషులు ఓ పద్ధతి, వ్యూహం ప్రకారం ఓ ముఠాగా ఏర్పడి రూ.371 కోట్ల డబ్బు దోచేశారన్నారు. యూత్ శిక్షణ పేరుతో ఈ డబ్బు దోచేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు విజన్ ఈ స్కాంలో కనిపిస్తోందన్నారు.

ఈ స్కాం కోసం తమకు కావాల్సిన మనుషుల్ని స్కిల్ కార్పోరేషన్ లోకి తెచ్చి పెత్తనాలు ఇచ్చారన్నారు.ఈ ఒప్పందాలపై ప్రభుత్వంలో చర్చ చేయలేదన్నారు. ప్రపంచంలో ఏ ప్రైవేటు కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా అని ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయం నుంచి ఒప్పందానికి వచ్చేసరికి 90 శాతం గ్రాంట్ ఇన్ అన్న ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయిందన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం వాటా కాస్తా ఆర్ధిక తోడ్పాడుగా మారిపోయిందన్నారు. జీవో నుంచి ఒప్పందానికి వచ్చేసరికి దీని స్వరూపం అంతా మారిపోయిందని జగన్ తెలిపారు. జీవో మార్పు తర్వాత ఎంవోయూలో పదాలు మారిపోయాయని, జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారని ప్రశ్నించారు.

ఎల్లోమీడియా చూపదు, పవన్ ప్రశ్నించరు..

ఎల్లోమీడియా చూపదు, పవన్ ప్రశ్నించరు..

తాను బటన్ నొక్కితే రాష్ట్రంలో జనం ఖాతాల్లోకి జబ్బులు వెళ్తున్నాయి, చంద్రబాబు బటన్ నొక్కితే అటు తిరిగి ఇటు తిరిగి డబ్బులు ఆయన ఖాతాల్లోకే చేరాయని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు అనుమతి లేకుండా ఇన్ని వందల కోట్ల ఒప్పందాలు జరుగుతాయా అని ప్రశ్నించారు. అలాగే ఇంత పెద్ద స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఆధారాలు కావాలా అని జగన్ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న ఎల్లో మీడియా చూపించదు, దత్తపుత్రుడు కూడా స్పందించడన్నారు. దోచుకో, పంచుకో, తినుకో తరహాలో డీబీటీ అలా నడిచిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+