సింగయ్య మృతి కేసు వెనుక - జగన్ చెబుతోందేంటి..!!

సంచలనంగా మారిన సింగయ్య మృతి కేసు పై మాజీ సీఎం జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు. సింగయ్య మృతి కేసు లో జగన్ ను ఏ-2గా చేర్చారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందారని కేసు నమోదైంది. జగన్ ప్రయాణించిన వాహనాన్ని పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ రోజు హైకోర్టు విచారణ చేయాల్సి ఉండగా.. రేపటికి (శుక్రవారం) వాయిదా పడింది. కాగా, ఈ కేసు పై జగన్ పలు అంశాలను వివరించారు.

వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసు లో మాజీ సీఎం జగన్ ఏ-2గా ఉన్నారు. ఈ కేసులో తన పేరు కుట్ర పూరితంగా చేర్చారని జగన్ పేర్కొంటున్నారు. ఈ కేసులో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తన పైన నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసారు. ఈ రోజు ఆ పిటీషన్ విచారణకు రానుంది. జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. కాగా, జగన్ కారు కింద పడి సింగయ్య ప్రాణాలు కోల్పోయినట్లు వీడియో వైరల్ అయింది. జగన్ తో పాటుగా పలువురు వైసీపీ నేతల పైన పోలీసులు కేసు నమోదు చేసారు. జగన్ ప్రయాణించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, జగన్ తన పిటీషన్ లో పలు అంశాలను ప్రస్తావించారు.

YS Jagan explains the case details in quash petition in high court over Plandau accident

మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్‌ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 (హత్య కిందకు రాని కల్పబుల్‌ హోమిసైడ్‌), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారని వివరించారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదని జగన్ తన పిటీషన్ లో వివరించారు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారని గుర్తు చేసారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్‌పై విడుదల చేశారని పిటీషన్ లో పేర్కొన్నారు.

కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారని జగన్ గుర్తు చేసారు. త పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని వివరించారు. ప్రజలను కలవ కుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టిందని ఆరోపించారు. ఈ అంశాలను పరిగణ నలోకి తీసుకొని తన పై నమోదుచేసిన కేసును కొట్టేయాలని జగన్ కోరారు. మరోవైపు ఇదే ఘటన లో తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని , విడదల రజిని హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటి పైన ఈ రోజు జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది. కోర్టు విచారణ తరువాత ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠతను పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+