అభియోగాలు.. నాపై కేసు కొట్టి వేయండి: హైకోర్టుకు వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. నందిగామ పోలీస్ స్టేషన్‌లో తన పైన నమోదైన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. నందిగామ పోలీస్ స్టేషన్‌లో తన పైన నమోదైన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
దివాకర్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లా నందిగామ వద్ద పెను ప్రమాదానికి గురై పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో జరిగిన ఘటనల అనంతరం తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాలని తెలుగు రాష్ట్రాల హైకోర్టును జగన్ ఆశ్రయించారు.

ఆసుపత్రిలో తమను జగన్ దర్భాషలాడాడని, తమ విధులకు ఆటంకం కలిగించారని డాక్టర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి, జగన్ పైన పలు సెక్షన్ల కింద అభియోగాలను మోపారు.












Click it and Unblock the Notifications