YS Jagan: వైఎస్ జగన్ ఇంట్లో ముగిసిన 41 రోజుల రాజశ్యామల చండీయాగం..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎల్లుండి విదేశాలకు వెళ్లేందుకు జగన్ సిద్దమవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ దేశాల్లో పర్యటన కోసం సీబీఐ కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 41 రోజులుగా తన ఇంట్లో నిర్వహిస్తున్న యాగాన్ని కూడా పూర్తి చేశారు.

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో గత 41 రోజులుగా రాజశ్యామల చండీయాగం జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని, ప్రజాహిత పాలన కొనసాగాలని కోరుతూ ఈ యాగం నిర్వహిస్తున్నారు. 41 రోజులుగా జరుగుతున్న ఈ యాగాన్ని ఇవాళ ముగించారు. ఈ రాజశ్యామల సహస్ర చండీయాగాన్ని నల్లపెద్ది శివరామప్రసాదశర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మ నిర్వహించారు.

ys jagan finished yagam at house for winning in ap election

తాడేపల్లిలోని జగన్ నివాసంలో 41 రోజుల పాటు యాగం 45 మంది వేద పండితులు ఇందులో పాల్గొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో పూర్ణాహుతికి ఉపయోగించే ద్రవ్యాలకు సీఎం వైయస్‌.జగన్‌తో షోడషోపచార పూజలు చేయించిన వేద పండితులు...అనంతరం ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో చండీయాగ నిర్వాహకులు అరిమండ వరప్రసాదరెడ్డి, విజయశారదరెడ్డి దంపతులు, పడమట సురేష్‌బాబు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+