'మళ్లీ వైఎస్ స్వర్ణయుగం.. గెలుపంటే ఎమ్మెల్యేలను లాక్కోవడం కాదు'
'సీఎంగా గెలవడమంటే ఎమ్మెల్యేలను, కార్పోరేటర్లను లాక్కోవడం కాదు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలి' అని సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేశారు.
దోర్నాల: కర్నూలు జిల్లా దోర్నాలలో వైసీపీ అధినేత జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్బంగా దోర్నాలలో ప్రసంగించిన ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా.. ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత రాష్ట్రాన్ని వరుసగా కరువులు పలకరించాయని జగన్ విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ పనితీరును జగన్ తప్పుబట్టారు. ముష్టి వేసినట్టు కేవలం రూ.100కోట్లు కేటాయించారని, ఆ నిధులు ఏ మూలకు సరిపోవని అన్నారు. హెడ్ రెగ్యులేటరీ పనులను ఇప్పటివరకు ప్రారంభించిన దాఖలా లేదన్నారు.

ఎప్పుడూ డబ్బేనా చంద్రబాబు?:
ఎప్పుడూ డబ్బు.. డబ్బు.. అంటూ అదే వైఖరితో వ్యవహరించే చంద్రబాబు రైతులు మీద ప్రేమ చూపించాల్సింది పోయి.. కాంట్రాక్టర్ల మీద ప్రేమ కురిపిస్తున్నారని జగన్ మండిపడ్డారు. డబ్బు తప్ప చంద్రబాబుకు ఇంకేమి పట్టదని ఆరోపించారు. టీడీపీ పాలనలో ఇప్పటికే మూడేళ్లు పూర్తయ్యాయని, వచ్చే దఫా ఎన్నికల్లో వైసీపీదే విజయం అని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

వారిపై అనర్హత వేటు పడాల్సిందే:
'మన ప్రభుత్వం వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తామని' ఈ సందర్బంగా జగన్ హామి ఇచ్చారు. ఇక పార్టీ ఫిరాయింపుల గురించి ప్రస్తావిస్తూ.. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరినవారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని అన్నారు.

గెలవడమంటే లాక్కోవడం కాదు:
'సీఎంగా గెలవడమంటే ఎమ్మెల్యేలను, కార్పోరేటర్లను లాక్కోవడం కాదు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలి' అని సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతీ పథకాన్ని నీరుగారుస్తున్నారని, ఆరోగ్యశ్రీని ఏకంగా రోడ్డు మీదే పడేశారని జగన్ విమర్శించారు.

బాబు హయాంలో ఒక్క ఇల్లు కూడా!..
వైఎస్ హయాంలో పేదల కోసం 42లక్షలు ఇళ్లు నిర్మిస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మించిన దాఖలా లేదన్నారు జగన్. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా చంద్రబాబు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

మళ్లీ వైఎస్ స్వర్ణయుగం..:
దివంగత మహానేత వైఎస్ హయాంలో ఉన్న సువర్ణయుగం రాష్ట్రంలో మళ్లీ రావాలని జగన్ ఆకాంక్షించారు. వెన్నుపోటు నేతలను బంగాళాఖాతంలో కలపాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. ప్రసంగానంతరం వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications