కేరళలో భిక్షమెత్తుకుంటున్నారు, ఎందుకీ పరిస్థితి: సభలో జగన్ ఫైర్

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఉపాధి హామి నిధులను సద్వినియోగం చేయకపోవడంతో ఉపాధి లేక రైతులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.

ఉపాధి హామీ పనుల్లోల లేబర్ కాంపోనెంట్‌(కార్మికుల వ్యయాన్ని)ను తగ్గించి మెటీరియల్ కాంపోనెంట్‌ను పెంచుతున్నారన్నారు. లేబర్ కాంపోనెంట్‌ను తగ్గించడం వల్ల పనులు లేక కూలీలు ఉపాధి కోసం కేరళ, కర్ణాటక, చెన్నైకి వలస పోతున్నారని అన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే మన రాష్ట్రానికి చెందిన అన్నదాతలు కేరళలో భిక్షాటన చేస్తున్నారని అన్నారు.

YS Jagan fires at AP Government for farmers immigrant issue

ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని జగన్ ప్రశ్నించారు. వైయస్ హయాంలో 97.7శాతం ఉపాధి హామీ నిధులను లేబర్ కాంపోనెంట్‌కే వినియోగించారని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, సిమెంట్ రోడ్లు, శ్మశానాల నిర్మాణాలకు ఈ నిధులు ఖర్చు పెడుతోందని అన్నారు.

సిమెంట్ పనులు పెరగడం వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోతోందని జగన్ అన్నారు. మెటీరియల్ కాంపోనెంట్‌ను ఎక్కువ చేయడం వల్ల అవార్డులు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ పేదల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. అనంతరం ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇది ఇలా ఉండగా, ఉపాధి హామీపై జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వైయస్ హయాంలో నిధులు ఖర్చు చేయలేదని, దీంతో అప్పుడు నిధులు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పారు. ప్రస్తుతం నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని, ఉపాధి హాపీ పథకంలో 60-40శాతం ప్రకారం నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Saturday fired at Anhdra Pradesh Government for farmers immigrant issue.
Please Wait while comments are loading...