అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెనుకొండ: బాధితులకు జగన్ పరామర్శ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ప్రమాద ఘటన స్థలికి చేరుకున్న జగన్, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తీసుకెళ్లిన పుస్తకాల బ్యాగులు, భోజన క్యారియర్లు చూసి జగన్ చలించిపోయారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అన్నారు. పక్కనే లోయ ఉన్నప్పటికీ బారికేడ్లు గానీ, పెద్ద రాళ్లు కానీ పెట్టకుండా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహించారని చెప్పారు. బారికేడ్లు కట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 15 మంది బలయ్యారని అన్నారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారని.. తలచుకుంటేనే గుండె తరక్కుపోతోందని జగన్ అన్నారు.

ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, క్షతగాత్రులకు 5లక్షల పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను వైయస్ జగన్ పరామర్శించారు. జగన్ వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శంకర్ నారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా తదితరులున్నారు.

జగన్

జగన్

అనంతపురం జిల్లాలోని పెనుకొండ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

జగన్

జగన్

బుధవారం ప్రమాద ఘటన స్థలికి చేరుకున్న జగన్, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

జగన్

జగన్


విద్యార్థులు తీసుకెళ్లిన పుస్తకాల బ్యాగులు, భోజన క్యారియర్లు చూసి జగన్ చలించిపోయారు.

జగన్

జగన్

ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అన్నారు. పక్కనే లోయ ఉన్నప్పటికీ బారికేడ్లు గానీ, పెద్ద రాళ్లు కానీ పెట్టకుండా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహించారని చెప్పారు.

జగన్

జగన్

బారికేడ్లు కట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 15 మంది బలయ్యారని అన్నారు.

జగన్

జగన్


వీరిలో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారని.. తలచుకుంటేనే గుండె తరక్కుపోతోందని జగన్ అన్నారు.

జగన్

జగన్

క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను వైయస్ జగన్ పరామర్శించారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Wednesday fired at AP Government about anathapuram bus accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X