వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిల, సుజయలకు మంత్రి పదవి: బాబుపై ఊగిపోయిన జగన్, గవర్నర్‌పైనా..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరి, ఇప్పుడు మంత్రులు అయిన ఎమ్మెల్యేలపై, సీఎం చంద్రబాబుపై వైసిపి అధినేత జగన్ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరి, ఇప్పుడు మంత్రులు అయిన ఎమ్మెల్యేలపై, సీఎం చంద్రబాబుపై వైసిపి అధినేత జగన్ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

విస్తరణ: హరికృష్ణ-కళ్యాణ్ రామ్ హాజరు, కాళ్లుమొక్కిన లోకేష్, తడబడిన అఖిల ప్రియవిస్తరణ: హరికృష్ణ-కళ్యాణ్ రామ్ హాజరు, కాళ్లుమొక్కిన లోకేష్, తడబడిన అఖిల ప్రియ

చంద్రబాబు తన కేబినెట్లోకి వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు మంత్రి పదవులు వచ్చాయి. దీనిపై జగన్ మండిపడ్డారు.

ఏపీ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టిడిపిలో చేర్చుకోవడం దిగజారుడు చర్య అన్నారు. వారిపై అనర్హత వేటు వేయకుండా మంత్రులుగా చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అన్నారు. చంద్రబాబు తీరును సామాన్యులు, మేధావులు గ్రహించాలన్నారు. ఇలాంటి చర్యలను ప్రజలు ఏమాత్రం సహించరని, త్వరలో తీర్పునిస్తారని జగన్ అన్నారు.

గవర్నర్‌ నరసింహన్‌పై జగన్‌ విమర్శలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిని కేబినెట్‌లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్పీకర్‌ అండదండలతో సీఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కూడా పాలుపంచుకున్నారని వ్యాఖ్యానించారు.

YS Jagan fires at Chandrababu for indcucting YSRCP MLAs into cabinet

ప్రమాణంలో తడబాటు.. పాదాభివందనాలు

నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా ముగిసింది. మొత్తం 11 మంది మంత్రులు పూర్తిగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎమ్మెల్సీ లోకేశ్‌, సుజయ్‌ కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియలు ప్రమాణ చేసే సమయంలో తడబాటుకు గురయ్యారు. వీరు ముగ్గురు తొలిసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టటం గమనార్హం. కాగా లోకేశ్‌ ఎమ్మెల్సీ ఇటీవలే ఎన్నికయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చేసిన అఖిల ప్రియా అందరికంటే పిన్నవయస్కురాలు.

నాడు పవన్ కళ్యాణ్‌పై అలా, నేడు రివర్స్: టిడిపిపై బోండా తీవ్ర వ్యాఖ్యనాడు పవన్ కళ్యాణ్‌పై అలా, నేడు రివర్స్: టిడిపిపై బోండా తీవ్ర వ్యాఖ్య

పాదాభివందనాలు

ప్రమాణ స్వీకారం అనంతరం కొందరు నేతలు చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్‌ తండ్రికి, గవర్నర్‌కు పాదాభివందనం చేశారు. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నక్కా ఆనందబాబు, జవహార్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.

English summary
YS Jagan fires at Chandrababu for indcucting YSRCP MLAs into cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X