వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎంపీలకు సెల్యూట్, టీడీపీకి డిపాజిట్లు గల్లంతే: సిగ్గు లేదా? అంటూ బాబుపై జగన్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం రాజీనామా చేసిన తమ పార్టీ ఐదుగురు ఎంపీలకు సెల్యూట్ చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. హోదా కోసం ప్రస్తుతం తుపాకీ నుంచి ఐదుగుళ్లు మాత్రమే వచ్చాయని అన్నారు.

సెటైర్లు, విమర్శల వర్షం: చంద్రబాబును ఓ ఆట ఆడేసిన జగన్, మామూలుగా కాదు!సెటైర్లు, విమర్శల వర్షం: చంద్రబాబును ఓ ఆట ఆడేసిన జగన్, మామూలుగా కాదు!

ఓ సిపాయి శత్రువుతో పోరాడుతుంంటే అతని తుపాకీ నుంచి ఐదు బుల్లెట్లే వచ్చి మిగితాయి రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాజీనామాలపై టీడీపీ కలిసి రాలేదని మండిపడ్డారు.

టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావు

టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావు

టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసివుంటే హోదాపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగివుండేదని అన్నారు. బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తే సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి తమ అభ్యర్థులను పోటీ పెడితే.. ఆ పార్టీకి ప్రత్యేక హోదాకు అనుకూలమన్నట్లా? ప్రతికూలమన్నట్లా? అని ప్రశ్నించారు. ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని అన్నారు.

Recommended Video

పవన్, జగన్‌లతో కలిసి ఏపీపై మోడీ కుట్ర: శివప్రసాద్
బుద్ధున్నోడెవడైనా..

బుద్ధున్నోడెవడైనా..

బుద్ది ఉన్నోడు ఎవడైనా.. హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలపై అభ్యర్థులను నిలబెడతారా? అని జగన్ నిలదీశారు. సార్వత్రిక ఎన్నికలకు 14నెలల ముందే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతను టీడీపీ తమ పార్టీలోకి తీసుకుందని జగన్ ఆరోపించారు.

రాజ్యాంగం గురించి మాట్లాడతారా?

రాజ్యాంగం గురించి మాట్లాడతారా?

అంతేగాక, వైసీపీ గుర్తుపై గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడమే గాక, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని దుయ్యబట్టారు. న్యాయంగా వారిని అనర్హతకు గురిచేయాల్సి ఉంది.. కానీ, చంద్రబాబు చేతిలో ఉన్న ఈ పనిని కూడా ఎందుకు చేయడం లేదని జగన్ ప్రశ్నించారు. సిగ్గులేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసి రాజ్యాంగం గురించి మాట్లాడతారా? అంటూ బాబుపై జగన్ ధ్వజమెత్తారు.

హోదా వస్తుందని తెలిసినా

హోదా వస్తుందని తెలిసినా

అందరు ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వస్తుందని తెలిసినా చంద్రబాబు తమ పార్టీ ఎంపీలను రాజీనామా చేయించడం లేదని, రాజీనామా చేసిన తమ పార్టీ ఎంపీలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఎంపీలు నీతి, నిజాయితీలతో పోరాడుతున్నారని చెప్పారు. తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించకుండా చంద్రబాబు పడరాని పాట్లు, బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
YSRCP president YS Jaganmohan Reddy on Wednesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu for TDP MPs resignation for special statu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X