అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై జగన్ నిప్పులు: 'వింత రోగం, అవసరం తీరాక మోసాలు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే చంద్రబాబు, అదే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడని వైసీపీ అధినేత వైయస్ జగన్ విమర్శించారు. భారతరత్న డాక్టర్. బీఆర్ అంబేద్కర్ 125 జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం ఆయన లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ దేశంలోని అట్టడుగు వర్గాల వారికి అంబేద్కర్ పాటు పడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరం వచ్చినప్పుడు ఎవరిపైనైనా భక్తిని చాటుతూ ఫోటోలకు, విగ్రహాలకూ పూలదండలు వేస్తాడని, అవసరం తీరాక ఎస్సీల్లా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని ప్రశ్నిస్తారని జగన్ మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా ప్రతి దళితుడు అడుగుతున్నాడు. కేవలం మేం క్రైస్తవ మతం తీసుకున్నాం కాబట్టి ఎస్సీ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నారు. దళితుడు ఏ మతం పాటిస్తే ఏంటి, ఏ దేవుడిని పూజిస్తే ఏంటి? కేవలం క్రైస్తవమతం తీసుకున్నారన్న ఏకైక కారణంతో ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దారుణం కాదా? ఇంతటి దౌర్భాగ్య పరిస్థితిలో మన రాష్ట్రం ఉందని అన్నారు.

అయినా ముఖ్యమంత్రి కనీసం నోరెత్తడం లేదు. చంద్రబాబు మైండ్ సెట్, ప్రభుత్వ మైండ్‌సెట్ కూడా మారాలి. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారంటే.. ఇలాంటి ముఖ్యమంత్రి తమకొద్దని ఎస్సీలు నినదిస్తున్నారు. వర్ధంతి రోజు, జయంతి రోజు తలచుకుని, 125 అడుగుల విగ్రహాన్ని పెడితే చాలదన్నారు.

చంద్రబాబుపై జగన్ నిప్పులు: 'వింత రోగం, అవసరం తీరాక మోసాలు'

చంద్రబాబుపై జగన్ నిప్పులు: 'వింత రోగం, అవసరం తీరాక మోసాలు'

అంబేద్కర్ స్ఫూర్తిని కాలరాస్తూ, ఎస్సీ, ఎస్టీ, పేదలకు ఆయన అన్యాయం చేస్తున్నాడని, తిరిగి ఆయన జయంతి, వర్థంతి దినాల్లో దండలు వేస్తూ, తానే వాళ్లకోసం పోరాటం చేస్తున్నట్టు ఫోజులిస్తాడని, ఇది చంద్రబాబుకు ఉన్న దౌర్భాగ్యమైన రోగమని ఆయన ఎద్దేవా చేశారు.

 చంద్రబాబుపై జగన్ నిప్పులు: 'వింత రోగం, అవసరం తీరాక మోసాలు'

చంద్రబాబుపై జగన్ నిప్పులు: 'వింత రోగం, అవసరం తీరాక మోసాలు'

ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్‌ను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలని అంబేద్కర్ కృషి చేశారని, అయితే ప్రభుత్వం మాత్రం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను తుంగలో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సైతం ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు.

 చంద్రబాబుపై జగన్ నిప్పులు: 'వింత రోగం, అవసరం తీరాక మోసాలు'

చంద్రబాబుపై జగన్ నిప్పులు: 'వింత రోగం, అవసరం తీరాక మోసాలు'

ఇక ట్రైబల్ అడ్వైజరీ కమిటీ విషయానికి వస్తే ఏపీలో ఏడు అసెంబ్లీ స్ధానాల్లో ఆరింట వైసీపీ పార్టీకి చెందిన నేతలు గెలిచారని ట్రైబల్ అడ్వైజర్ కమిటీ వేయడం లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు తాను న్యాయం చేస్తున్నాడని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఒకసారి తన అంతరంగాన్ని ప్రశ్నించుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు చెబుతున్న అబద్దాలు, చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

 చంద్రబాబుపై జగన్ నిప్పులు: 'వింత రోగం, అవసరం తీరాక మోసాలు'

చంద్రబాబుపై జగన్ నిప్పులు: 'వింత రోగం, అవసరం తీరాక మోసాలు'

కానీ చంద్రబాబు ఈవాళ ప్రజల తరఫున మాట్లాడాల్సిన ఎమ్మెల్యేల గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. ప్రజల తరపున వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారన్న అనుమానంతో వారిని కొనుగోలు చేస్తున్నాడని, విపక్షం లేకుండా చూడాలన్నదే ఆయన ఉద్దేశమని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే వాళ్లు లేకుండా చేయాలని చంద్రబాబు ఉద్దేశమని కానీ, ఆయన కోరిక నేరవేరదని అన్నారు.

English summary
ys jagan fires on Chandrababu naidu on ambedkar jayanti day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X