ఇక యుద్ధమే, నెక్స్ట్ జరిగేదిదే- పార్టీ నేతలకు తేల్చి చెప్పిన జగన్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస కేసులు.. వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయం వేళ పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ప్రస్తుత పరిస్థితు లపైన స్పందించారు. పోరాటాలు వైసీపీకి కొత్త కాదని వ్యాఖ్యానించారు. కేసులు.. జైళ్లతో కట్టడి చేయలేరని పేర్కొన్నారు. ఇదే సమయంలో పార్టీ నుంచి అమలు చేయాల్సిన కార్యాచరణ పైన స్పష్టత ఇచ్చారు. ఇక ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ చేసారు. ఇందు కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబును ప్రజల్లో ఎండగట్టాలని నిర్దేశించారు.
ఇక ప్రజల్లోనే
వరుస కేసులు.. నేతల అరెస్ట్ వేళ మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. ప్రస్తుత పరిణామాల ను వివరించారు. చేయాల్సిన కార్యక్రమం పై స్పష్టత ఇచ్చారు. జూలై 1వ తేదీ నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఏడాది పాలనలో చేసిన కార్యక్రమాల గురించి గడప గడపకు వెళ్లాలని సీఎం చంద్ర బాబు ఆదేశించారు. సరిగ్గా ఇదే సమయంలో జగన్ సైతం తమ పార్టీ నేతలను జనం మధ్యకు వెళ్లేలా కొత్త కార్యక్రమం రూపొందించారు. 'బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ'. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడు తూ..'రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో'.. 'చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..' పేరుతో వైయస్సార్‌సీపీ 5 వారాల కార్యక్రమాన్ని జగన్ ఖరారు చేసారు. దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ ఆవిష్కరించిన జగన్.. ఇంటింటికీ దాన్ని చేర్చేలని నిర్దేశించారు.

చంద్రబాబుపై కామెంట్స్
తక్కువ కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం పైన దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటి క్స్‌తో పాటు, అణిచివేత .. రెడ్‌బుక్ పాలన చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అన్యాయాలు చేస్తూ వైసీపీ నేతలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత.. మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అనే ది చెప్పాలి సూచించారు. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. చంద్రబాబు ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారనేది ప్రతీ ఇంటికి తీసుకెళ్లటమే ఈ కార్యక్రమ లక్ష్యమని స్పష్టం చేసారు.
ఇక పోరాటమే
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు.. బాండ్ల గురించి ప్రజలకు గుర్తు చేస్తూ ఏ విధంగా మోసం చేసారో వివరించాలని జగన్ సూచించారు. పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు మరో వైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయిం బర్స్‌మెంట్. ఆరు త్రైమాసికాలు పెండింగ్ ఉందని.. అలా రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్గుగా పేర్కొన్నారు. అయిదు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ నిర్దేశించారు. గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేసారు. ఏడాది గడవటంతో హానీమూన్ పీరియడ్ ముగిసిందన్నారు. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాడాలని జగన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications