28 నుంచి విదేశాలకు జగన్: నంద్యాలపై చెప్పలేకే, వైసిపి కుట్ర చేసిందని పత్తిపాటి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

టీడీపీతోనే పొత్తు: పురంధేశ్వరికి బీజేపీ నేత షాక్! బాబు హ్యాపీ

28న లండన్, యూరప్ పర్యటనలకు జగన్

28న లండన్, యూరప్ పర్యటనలకు జగన్

జగన్ ఈ నెల 28న లండన్, యూరప్‌లలో పర్యటించనున్నారు. నవంబర్ 2న తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత, నవంబర్ 6 నుంచి తలపెట్టిన పాదయాత్రలో జగన్ పాల్గొంటారు.

పాదయాత్రపై నేతలతో ఇప్పటికే చర్చించిన జగన్

పాదయాత్రపై నేతలతో ఇప్పటికే చర్చించిన జగన్

కాగా, నవంబర్ 6 నుంచి జగన్ తలపెట్టనున్న పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్రగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అన్ని విభాగాల నేతలతో జగన్ విస్తృతంగా చర్చించారు.

నంద్యాల వ్యాఖ్యలపై జవాబు చెప్పలేకే

నంద్యాల వ్యాఖ్యలపై జవాబు చెప్పలేకే

నంద్యాల ఉపఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి అధినేత వైయస్ జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటికి సమాధానం చెప్పలేకే సమవేశాలు బహిష్కరిస్తున్నారని, సభకు రాకుండా పారిపోతున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.

జగన్‌పై సంచలన ఆరోపణలు

జగన్‌పై సంచలన ఆరోపణలు

ఎన్టీఆర్ ఆదర్శంతో తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసిపి ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి పత్తిపాటి స్పందించారు. మూడున్నరేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని వైసిపి అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. ఒడిశా ఎంపీలతో చేతులు కలిపి పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైసిపి నేతలు కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై నిలదీయాలనుకుంటే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy will tour London and Europe from october 28. He will return on November 2.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి