మేం మారం: జగన్, ఢిల్లీలో ఒకరు షాకిచ్చారు (పిక్చర్స్)

న్యూఢిల్లీ: అడ్డగోలు విభజనను అడ్డుకుందామని, తమ సమైక్య నినాదంలో మార్పు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు సాధించే ప్రయత్నాలలో భాగంగా జగన్ శనివారం ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల లబ్ధి కోసం విభజన సరికాదని, ఈ రోజు ఎపిలో జరుగుతున్న పరిణామం రేపు బీహార్, యుపి, తమిళనాడు, బెంగాల్లోను జరగవచ్చునన్నారు. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం ఓ గీత గీసేసి రాష్ట్రాన్ని విభజిస్తున్నామని చెప్పేయవచ్చునన్నారు.

ఇది చాలా పెద్ద సమస్య అని, దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కాంగ్రెసు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అని, ఇందుకోసం పోరాటంలో అందరు కలిసి రావాలని కోరారు. సమైక్యాంధ్రకు, ఆర్టికల్ 3 సవరణకు సిపిఎం మద్దతివ్వగా, తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, సవరణపై పార్టీలో చర్చిస్తామని సిపిఐ తెలిపింది.

జగన్ 1

జగన్ 1

భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉన్న తమ పార్టీ విధానం మారదని సిపిఎం హామీ ఇవ్వగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతు కొనసాగుతుందని సిపిఐ నిష్కర్షగా జగన్‌కు చెప్పింది.

జగన్ 2

జగన్ 2

అయితే తెలంగాణ ఎర్పాటు వల్ల సీమాంధ్రకు అన్యాయం జరగకుండా చూస్తామని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి జగన్‌కు హామీ ఇచ్చారు.

జగన్ 3

జగన్ 3

శనివారం జగన్ ఢిల్లీలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరితో చర్చించారు. ఆతరువాత జగన్ సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశమయ్యారు.

జగన్ 4

జగన్ 4

భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకమని ఏచూరి స్పష్టం చేశారు. అనేక ఆందోళనలు జరిగిన తరువాత భాషాప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని, అప్పటి విధానసభ తీర్మానం తరువాతే విశాలాంధ్ర ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు.

జగన్ 5

జగన్ 5

విధానసభ తీర్మానం ఆమోదం లేకుండా రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని ఏచూరి చెప్పారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ఓడించటానికి కృషి చేస్తామని అన్నారు.

జగన్ 6

జగన్ 6

సురవరం సుధాకర్ రెడ్డిమాట్లాడుతూ తెలంగాణ వేరుపడినంత మాత్రాన సీమాంధ్రకు అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

జగన్ 7

జగన్ 7

రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉందని సురవరం సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

జగన్ 8

జగన్ 8

భవిష్యత్‌లో ఏ పార్టీకి 272 స్థానాలు లభించే అవకాశాలు లేనందున, ఫ్రంట్‌లు ఏర్పడే అవకాశం ఉందని, ఈ అధికరణను పాలకపక్షం తనకు తోచిన తీరులో దుర్వినియోగం చేయకుండా తగిన చర్యలు తీసుకోవలసి ఉందని సురవరం అన్నారు.

జగన్ 9

జగన్ 9

అడ్డగోలు విభజనను అడ్డుకుందామని, తమ సమైక్య నినాదంలో మార్పు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం చెప్పారు.

జగన్ 10

జగన్ 10

శనివారం జగన్ ఢిల్లీలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారామ్ ఏచూరితో చర్చించారు. ఆతరువాత జగన్ సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+