ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్- కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేసే వారికీ ఈ పెంపు..!
ఏపీలో ఉద్యోగులకు ఎన్నికల ఏడాదిలో సీఎం వైఎస్ జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లాల విభజన తర్వాత ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓ అంశంపై ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా ఉద్యోగులకు భారీగా ప్రయోజనం కలగబోతోంది. దీంతో ఉద్యోగులకు ఇప్పటికే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న సమస్యల కోవలోకి హెచ్ఆర్ఏ కూడా చేరింది.
ఏపీలో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏ(ఇంటి అద్దె భత్యం) పెంచుతూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ వారికి ఇస్తున్న 12 శాతం నుండి 16 శాతానికి హౌస్ రెంట్ అలవెన్సు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్దిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం ఇవాళ పెంచిన హెచ్ఆర్ఏ పలు కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించబోతోంది. వీటిలో పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల,రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వనిచేస్తున్న ఉద్యోగులు తమకు కూడా హెచ్ఆర్ఏన 16 శాతానికి పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఎట్టకేలకు వైఎస్ జగన్ సర్కార్ ఎన్నికల ఏడాదిలో వారికి ఈ ప్రయోజనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో జిల్లాల పునర్విభజన చేసిన సమయంలో ప్రభుత్వం రాజధాని అమరావతితో పాటు ప్రధాన నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్ఆర్ఏ పెంపు వర్తింపచేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఈ పెంపు వర్తింపచేయాలంటూ ప్రభుత్వాన్ని చర్చల సమయంలో కోరారు. ఎట్టకేలకు ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం మన్నించడంతో ఇప్పుడు 4 శాతం హెచ్ఆర్ఏ పెంపు ప్రయోజనం వారికి లభించబోతోంది.












Click it and Unblock the Notifications