ప్రైవేటు స్కూళ్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-తాజా వరాలివే..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిప్పటి నుంచి ప్రైవేటు స్కూళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలే. ఇందులో అమ్మఒడి దగ్గరి నుంచి నాడు నేడు, విద్యాకానుక, విద్యాదీవెన, గోరుముద్ద వంటి పథకాల నుంచి ఇంగ్లీష్ మీడియం వంటి నిర్ణయాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడాల్సిన పరిస్ధితి వచ్చింది.
ఈ నేపథ్యంలో నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు స్కూళ్లకు ఎన్నికలకు ముందు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు అంశాల్లో వారికి ఊరట కలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. గుర్తింపు, ఉన్నతీకరణతో పాటు పలు అంశాల్లో ముఖ్యంగా యాజమాన్యాలకు ఊరట కలిగించేలా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. దీంతో చాలా కాలం తర్వాత ప్రైవేటు స్కూళ్లకు గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.

ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లకు గతంలో కల్పించిన మూడేళ్ల గుర్తింపును ఎనిమిదేళ్లకు పొడిగించబోతున్నారు. ఇప్పటికే మూడేళ్లకు గుర్తింపు పొందిన స్కూళ్లకు ఎనిమిదేళ్లకు పొడిగిస్తున్నారు. కొత్తగా తీసుకునే వారికి మాత్రం ఎనిమిదేళ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. దీంతో మాటిమాటికీ గుర్తింపు కోసం విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ యాజమాన్యాలు తిరిగే బాధ తప్పనుంది.
అలాగే ప్రైవేటు స్కూళ్లలో అదనపు సెక్షన్ల ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వబోతోంది. ఇందుకోసం ఆఫ్ లైన్ లో ప్రతిపాదనలు పంపేలా ప్రైవేటు స్కూళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అంటే 2024-25 నుంచి
కొత్త పాఠశాలల ఏర్పాటు, ఉన్నతీకరణ(అప్ గ్రేడేషన్)కు డిసెంబర్ 31 వరకూ ఎలాంటి జరిమానాలు లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతోపాటు 2024లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్దుల కోసం అదనపు సెక్షన్లకు అనుమతులు ఇచ్చేందుకు ఆన్ లైన్ లో అవకాశమిస్తున్నారు.












Click it and Unblock the Notifications