ఏపీలో పెన్షన్ దారులకు మరో గుడ్ న్యూస్-ఈ నెలలోనే అలా..!

ఏపీలో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ పెన్షన్ రాలేదని బాధపడుతున్న వారికి శుభవార్త అందించింది. పెన్షన్లకు అర్హత ఉండీ ఇప్పటివరకూ అందుకోని వారికి జగనన్న సురక్ష పథకం ద్వారా గుర్తించిన ప్రభుత్వం వారిని కూడా లబ్దిదారుల జాబితాలో చేరుస్తోంది. క్షేత్రస్ధాయి పరిశీలన అనంతరం వీరికి పెన్షన్లు పంపిణీ చేయబోతోంది. దీంతో ఈసారి పెన్షన్ల చెల్లింపు తేదీని పొడిగించింది.

ఏపీలో వైఎస్సార్ ఆసరా పథకం కింద ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపు పూర్తి చేస్తోంది. వాలంటీర్లు స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం కొత్త లబ్దిదారుల చేరిక, వారి పేర్లతో జాబితాల్ని అప్ డేట్ చేయడం వంటి కారణాలతో పెన్షన్ల చెల్లింపు తేదీని తొలుత ఈనెల 7వ తేదీకి పొడిగించింది. అయితే తాజాగా దీన్ని ఈనెల 10వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 10వ తేదీ లోపు అందరికీ పెన్షన్లు అందబోతున్నాయి.

ys jagan good news to ysr asara pensioners for september month

వైసీపీ సర్కార్ గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకూ పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి వాటిని రెగ్యులర్ గా పెన్షన్లు ఇచ్చే జాబితాలో చేర్చే ప్రక్రియ చేపట్టింది. అయితే ఈ అదనంగా చేరిన వారికి సైతం పెన్షన్ల చెల్లింపు కోసం నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యం చోటు చేసుకుంటోంది. దీంతో ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకూ పెన్షన్లు చెల్లించేందుకు సెర్ప్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు క్షేత్రస్ధాయికి ఈ ఆదేశాలు పంపుతున్నారు.

రాష్ట్రంలో వైఎస్సార్ ఆసరా పథకం కింద ప్రస్తుతం లబ్దిదారులకు నెలకు రూ.2750 చొప్పున పెన్షన్ చెల్లిస్తున్నారు. ఈ మొత్తం వచ్చే ఏడాది కల్లా 3 వేలకు చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అర్హత ఉండీ పెన్షన్ అందని లక్షకు పైగా లబ్దిదారుల్ని తాజాగా ఈ పథకంలో చేర్చారు. వీరికి కూడా కలిపి ప్రతీ నెలా పెన్షన్ చెల్లించబోతున్నారు. ఈ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం కారణంగా కేవలం సెప్టెంబర్ నెల వరకే 10వ తేదీ వరకూ పెన్షన్ల చెల్లింపు తేదీని పొడిగించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి తిరిగి 5వ తేదీ వరకూ పెన్షన్లు చెల్లిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+