గ్రామ పంచాయతీల్లో ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...
ఏపీలో ఎన్నికల ఏడాది ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా బటన్ నొక్కి ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఇతర రంగాలు, అంశాల్లోనూ అవినీతి నిర్మూలనకు ఆదేశాలు ఇస్తోంది. ఇందుకోసం అధికారులు చేస్తున్న కసరత్తు క్రమంగా ఫలితాలు ఇస్తోంది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకూ బిల్లుల చెల్లింపుల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నగదు చెల్లింపులు మాత్రమే అనుమతిస్తుండటంతో చేతిలో డబ్బులు ఉంటేనే ఆస్తిపన్ను, కుళాయి పన్ను, నీటి తీరువా ఛార్జీలు వంటి చెల్లింపులు చేయాల్సి వచ్చేది. లేకపోతే డెబిట్, క్రెడిట్ కార్డులు, ఫోన్ పో, గూగుల్ పే వంటి యూపీఐ యాప్ లతో చెల్లింపులు చేసేందుకు వీలుండేది కాదు. అలాగే ప్రజల నుంచి వసూలు చేస్తున్న బిల్లుల మొత్తాలు కూడా పక్కదారి పడుతున్న ఘటనలు అక్కడక్కడా నమోదయ్యేవి. ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఈ నెల 15నుంచి డిజిటల్ బిల్లు చెల్లింపులు మాత్రమే స్వీకరించేలా ప్రభుత్వం పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డిజిటల్ విధానంలో పన్ను, ఛార్జీల వసూళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లోని పంచాయతీ కార్యాలయాల్లో బిల్లు చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్లను అందుబాటులో ఉంచుతున్నారు. పంచాయతీ కార్యదర్శులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటికి ఈ చెల్లింపులు జరిగేలా చేస్తున్నారు. అలాగే చెల్లింపు జరగ్గానే రసీదు కూడా ఇచ్చేసేలా ఆదేశాలు ఇచ్చారు.
అలాగే 3 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో పాయింట్ ఆఫ్ సేల్ (POS) డివైజ్ లు అందుబాటులో పెడుతున్నారు. వీటిలో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలుంటుంది. మరోవైపు ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు, ఛార్జీలకు డిజిటల్ విధానం అమలు చేస్తున్న ప్రభుత్వం.. పంచాయతీలు వివిధ అవసరాల కోసం చేసే చెల్లింపుల విషయంలోనూ డిజిటల్ విధానం తప్పనిసరి చేసింది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications