ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ-ఒకేసారి 60 మందికి స్ధాన చలనం..
ఏపీలో ప్రభుత్వం ఇవాళ భారీ ఎత్తున డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 60 మంది డిప్యూటీ కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం చేసిన ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే బదిలీలు చేసేందుకు అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే వ్యూహాత్మకంగా ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లు ఇవాళ బదిలీ అయిన వారిలో ఉన్నారు. వీరిని కొత్త స్ధానాల్లో తక్షణం చేరేలా సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారితో పాటు జూనియర్లు కూడా ఉన్నారు. వీరిని ఇతరత్రా స్దానాల్లో బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వీరంతా రేపో మాపో కొత్త స్ధానాల్లో విధుల్లో చేరబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం కలెక్టర్లతో పాటు ఐపీఎస్ లను ఈ మధ్య కాలంలో భారీగా బదిలీలు చేసింది.

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే వారిని కీలక స్ధానాల్లో నియమించుకోవడం సర్వసాధారణమే అయినా ఒకేసారి ఇంత మందిని బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు రెవెన్యూ శాఖలో పలు కీలక విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్లు ఇవాళ బదిలీ అయిన వారిలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం ఏంటనేది తెలియరాలేదు.












Click it and Unblock the Notifications