Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

YSRCP Bus Yatra : బస్సు యాత్రలు ఇలా ఉండాలి-వైసీపీ ముఖ్యులకు జగన్ దిశానిర్దేశం..

వైఎస్సార్సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇవాళ భేటీ అయ్యారు. తాజాగా విజయవాడలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో నిర్దేశించిన కార్యక్రమాలపై పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలతో చర్చించారు. సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యుల్ని జగన్ నియమించారు. బస్సు యాత్ర మీటింగుల ఏర్పాట్లను సమన్వయ పరచడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకులను నియమించారు.

దసరా పండుగ నేపథ్యంలో, పండుగ ముగించుకుని అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టాలని వైఎస్ జగన్ నేతలకు సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సమావేశాలు జరగాలన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనుంచి ప్రతి రోజూ ఒక మీటింగు చొప్పున మొత్తంగా మూడు మీటింగులు నిర్వహించాలన్నారు. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అని, అత్యంత విజయవంతంగా మీటింగులు జరిగేలా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే లేదా పార్టీ ఇన్‌ఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఈ సమావేశాల్లో మాట్లాడాలని సూచించారు.

ys jagan guide ysrcp regional co-ordinators on bus yatras from oct 26 in north andhra, rayalaseema

52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ మీటింగుల ద్వారా వివరించి ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలని జగన్ వారికి సూచించారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని, జరుగుతున్నది కులాల వార్‌ కాదు, క్లాస్‌ వార్‌ అని జగన్ తెలిపారు. పేదవాడు మన పార్టీని ఓన్‌ చేసుకోవాలని నేతలకు జగన్ సూచించారు. వచ్చే రెండు నెలలపాటు ఈ బస్సు యాత్ర జరగాలన్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలపై తేదీ, స్థలం సహా పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంశాలను ప్రస్తావిస్తూ ఈ బస్సు యాత్ర జరగాలని కోరారు:

అలాగే విజయవాడలో పార్టీ ప్రతినిధుల సమావేశంలో ప్రకటించిన కార్యక్రమాలపైనా నియోజకవర్గాల స్థాయిలో అవగాహన కల్పించాలని జగన్ సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే అవగాహన సమావేశంలో గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని జగన్ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను రీజినల్ కో-ఆర్డినేటర్లు సందర్శించాలన్నారు. ఎమ్మెల్యేలతో కలిసి.. ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరిగేలా చూడాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+