హ్యాట్సాఫ్.. వైసీపీ క్యాడర్ పై జగన్ ప్రశంసల జల్లు..! రీజన్ ఇదే..
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తన పార్టీ నాయకులు, క్యాడర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార కూటమి ప్రయత్నాల్ని అడ్డుకుని వైసీపీ జయకేతనం ఎగురవేసింది. కడప జడ్పీ సహా పలు చోట్ల వైసీపీ విజయాలు నమోదు చేసుకుంది. దీనిపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ట్వీట్ చేశారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, చంద్రబాబు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైయస్సార్‌కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారంటూ జగన్ ప్రశంసించారు.

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, @ncbn గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2025
విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నానని ట్వీట్ లో పేర్కొన్నారు. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్ అంటూ జగన్ ట్వీట్ ముగించారు.












Click it and Unblock the Notifications