జమిలిపై తేల్చేసిన జగన్- కాలర్ ఎగరేస్తాం

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నాయకులతో సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవని తేల్చి చెప్పారు. ఈ కష్టాలు ఎక్కువ రోజులు ఉండబోవని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో రాజకీయ ప్రత్యర్థులు దాడులు చేస్తోన్నారని, అలాంటప్పుడు క్యాడర్‌కు భరోసా ఉండాలని అన్నారు.

YS Jagan hold a meeting with the Mangalagiri Assembly constituency leaders

2019- 2024 మధ్య తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి ఇప్పటికీ ప్రతి ఇంట్లోనూ బతికే ఉందని జగన్ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను 95 శాతం అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి ఉందని, వెల్‌ఫేర్ క్యాలెండర్‌ను విడుదల చేసి, దానికి అనుగుణంగా క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రజలకు నిధులను విడుదల చేశామని గుర్తు చేశారు.

రాష్ట్రంలో పార్టీ నిర్మాణ గ్రామస్థాయిలో జరగాల్సిన అవసరం ఉందని, దీనికి అవసరమైన బూత్ కమిటీలను త్వరలోనే నియమిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తల అందరినీ క్రోడీకరించాలని, ఏకతాటిపైకి తీసుకుని రావాలని అన్నారు. పార్టీని బూత్ కమిటీ దాకా తీసుకెళ్లాలని చెప్పారు.

బూత్ స్థాయి వరకు పార్టీని నిర్మించుకోగలిగితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఢీ అంటే ఢీ అనే స్థాయికి ఉంటామని జగన్ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయని, అది కొత్తేమీ కాదని జగన్ పేర్కొన్నారు. ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు.

రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనేమీ కాదని, మనం గుడ్ బుక్ పెడదామని జగన్ పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన పార్టీ తరఫున ప్రజలకు మంచి చేసిన వాళ్ల పేర్లను గుడ్ బుక్‌లో రాసుకుందామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక వాళ్లకు పదవులు, ప్రమోషన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.

YS Jagan hold a meeting with the Mangalagiri Assembly constituency leaders

రెడ్ బుక్ అంటూ కొత్త సంప్రదాయాలు రాజకీయాల్లోకి వచ్చాయని, అందులో పేర్లు రాసి, వాళ్లపై రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, దాడులు చేయడం అనేది ఎప్పుడూ చూడలేదు.. ఎక్కడా వినలేదని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అన్నిరకాలుగా మోసగిస్తోన్నాడని విమర్శించారు.

ఒక్కటి కూడా మంచి చేసిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. తాము చేసిన మంచిని ప్రజలు విస్మరించలేదని, మళ్లీ తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, కాలర్ ఎగరేసుకుని ప్రజలకు మేలు చేస్తామని జగన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+