Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలియదని, కోర్టులోనే గాలిని జగన్ కౌగిలించుకున్నారు: సోమిరెడ్డి

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాడు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పారని, ఇప్పుడు జైలులో ఎదురుపడితే మాత్రం పలకరించుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.

ఆదివారం నాడు జగన్ దీక్షను నిరసిస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడారు. గాలి ఎవరో తెలియదని మొసలి కన్నీరు కార్చిన జగన్, ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఆయనను కౌగిలించుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమన్నారు.

కేసీఆర్ పైన నాగం ఆగ్రహం

YS Jagan hugs Gali Janardhan Reddy: Somireddy

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. సచివాలయానికి వాస్తు చూసుకోవచ్చునని, కానీ కార్యాలయాన్నే మార్చడం ఏమాత్రం సరికాదన్నారు. కేసీఆర్‌ ది తుగ్లక్‌ పాలన అని శనివారం ధ్వజమెత్తారు.

మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్‌ పేరుతో రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. సచివాలయం తరలించాలన్న ఆలోచన సరికాదన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. చెరువుల పునరుద్ధరణ కంటే ముందు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+