అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవి జరుగుతాయి: పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన జగన్, రాజీనామా, పాదయాత్రలపై..

అనంతపురంలో నిర్వహించిన యువభేరీలో వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజీనామాల అంశాన్ని ప్రస్తావించారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan comments on Pawan Kalyan పవన్ ను టార్గెట్ చేసిన జగన్ | Oneindia Telugu

అనంతపురం: అనంతపురంలో నిర్వహించిన యువభేరీలో వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజీనామాల అంశాన్ని ప్రస్తావించారు.

చంద్రబాబు దుమ్ము దులిపిన వైయస్ జగన్చంద్రబాబు దుమ్ము దులిపిన వైయస్ జగన్

అదే సమయంలో టిడిపితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేసారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా అని నిలదీశారు.

 ప్రత్యేక హోదాపై వీరి నిలదీత

ప్రత్యేక హోదాపై వీరి నిలదీత

ప్రత్యేక హోదా కోసం పదేపదే మాట్లాడిన వారు జగన్, పవన్ కళ్యాణ్, టిడిపిలు. ప్రత్యేక హోదాపై కేంద్రం తేల్చేసిన అనంతరం టిడిపి యూటర్న్ తీసుకుంది. హోదా కంటే ఎక్కువ కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. కానీ జగన్, పవన్‌లు మాత్రం పదేపదే నిలదీశారు.

 పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా

పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా

జగన్ ఏడెనిమిది నెలల క్రితం గుంటూరులో 9వ యువభేరీ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు అనంతపురంలో నిర్వహించారు. ఇన్నాళ్లు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడి, అది కుదరకపోవడంతో ఇప్పుడు మళ్లీ హోదా అంశాన్ని ఎత్తుకున్నారనే విమర్శలు వినిపించాయి. అయితే, జగన్ మాత్రం తాను మాట్లాడని ఈ ఆరు నెలల కాలంలో హోదా కోసం ఎవరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. తద్వారా పరోక్షంగా ఆయన పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

 చివరి అస్త్రంగా రాజీనామాలు

చివరి అస్త్రంగా రాజీనామాలు

జగన్ మరోసారి రాజీనామాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే వైసిపి ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించారు. చివరి అస్త్రంగా రాజీనామాలను ప్రయోగిస్తామని ఆయన చెప్పారు.

 మొదట ఒత్తిడి, ఆ తర్వాత

మొదట ఒత్తిడి, ఆ తర్వాత

ప్రస్తుతం కేంద్రంపై, టిడిపిపై ప్రత్యేక హోదా అంశం విషయంలో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని జగన్ చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తామన్నారు. అప్పటికీ రాకపోతే ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతాయని చెప్పారు.

 నవంబర్ 2 నుంచి పాదయాత్ర

నవంబర్ 2 నుంచి పాదయాత్ర

తాను నవంబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తున్నానని జగన్ చెప్పారు. ఈ పాదయాత్ర 3వేల కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. ఇడుపులపాయలో ప్రారంభమై, చిత్తూరు, ఇచ్చాపురం వరకు కొనసాగుతుందన్నారు. ఆరు నెలల పాటు ఉంటుందని చెప్పారు.

ఆ పరిస్థితి మారాలి, అప్పుడే జగన్ చేయగలడు

ఆ పరిస్థితి మారాలి, అప్పుడే జగన్ చేయగలడు

తన చివరి యువభేరీ నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి ఎవరు కూడా మాట్లాడలేదని జగన్ వాపోయారు. ఆ పరిస్థితి మారాలన్నారు. అధికార పార్టీలపై అందరం కలిసి ఒత్తిడి తేవాలన్నారు. దీనిని జగన్ ఒక్కడు చేయలేడని, మీ అందరి తోడ్పాటు ఉంటే జగన్ చేయగలడన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddyindirect comments on Jana Sena chief Pawan Kalyan and Telugu Desam over Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X