YS Jagan: చెప్పాడంటే..చేస్తాడంతే- సంక్షేమ లబ్దిదారులకు జగన్ లేఖలు..!
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక్క రోజు ముందు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని సంక్షేమ పథకాల లబ్దిదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నుంచి వారికి వ్యక్తిగతంగా కలిగిన లబ్దిని గణాంకాలతో సహా వివరిస్తూ ఈ లేఖల్ని రూపొందించారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాల లబ్ది అందుకున్న కుటుంబాల పెద్దలకు ఈ లేఖలను జగన్ పంపుతున్నారు. ఇందులో పలు విషయాలను ప్రస్తావించారు.
వైసీపీ తాజాగా ఎన్నికల శంఖారావం ప్రారంభించినప్పటి నుంచీ సీఎం జగన్ తన ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మ్యానిఫెస్టో వాగ్దానాలను 99 శాతం ఏ విధంగా అమలు చేసిందీ వివరిస్తున్నారు. ఇటీవల జరిగిన నాలుగు సిద్దం సభల్లోనూ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో దీన్ని మరింత లోతుగా సంక్షేమ లబ్ది అందుకున్న కుటుంబాల మనసుల్లోకి పంపేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఐదేళ్లలో ప్రతి గడపకు అందించిన లబ్దిని ప్రజల తీసుకున్న నిర్ణయాలు, పాలనా తీరును ప్రజలకు వ్యక్తిగతంగా అందించిన లబ్ధిని వారికి గుర్తుచేస్తూ సీఎం జగన్ లేఖ రాశారు. ఇలా కుటుంబ పెద్దకు పంపించిన ఈ లేఖలో గత ఐదేళ్లలో ప్రతి కుటుంబం పొందిన ప్రయోజనాలను తెలియజేస్తూ ఓ ధృవీకరణ పత్రం కూడా పంపుతున్నారు. గత ఐదేళ్లలో సీఎం జగన్ నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 128/129 వాగ్దానాలను అమలు చేసి 99% వాగ్దానాలు పూర్తి చేసిందని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
ఇలా జగన్ సంక్షేమ పథకాల లబ్దిదారులకు పంపుతున్న లేఖల్ని ఎక్కడికక్కడ వాలంటీర్లు వారికి అందజేస్తున్నారు. మార్చి 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 15 వరకు కొనసాగింది. గత 5 సంవత్సరాల్లో 1.5 కోట్ల కుటుంబాలకు రూ.2.55 లక్షల కోట్ల మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) అందించారు. దాదాపు 2.6 కోట్ల మందికి పైగా ప్రజలు నేరుగా దీంతో లబ్ధి పొందారనే వాస్తవాన్ని సీఎం జగన్ లేఖ ద్వారా మరోసారి ప్రజలకు గుర్తుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications