'ఏపీ రాజకీయాల్లో జగన్ గెస్ట్ ఆర్టిస్ట్, వింత వ్యాధితో బాధపడుతున్నారు'

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గురువారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందని కేఈ కృష్ణమూర్తి అన్నారు. వైయస్ జగన్ అప్పుడప్పుడు బయటకు వస్తున్నారని, ఆయన రాజకీయాలలో గెస్ట్ యాక్టర్‌లా వచ్చి పోతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ చేపట్టిన 'గడపగడపకూ వైసిపి' ఓ ప్లాప్ షో అన్నారు.

Also Read: కేసీఆర్ కంటే తక్కువ..! నాకు ఆ ర్యాంక్ ఇస్తారా: మోడీపై బాబు అసహనం

'YS Jagan is guest artist in AP politics'

సొంత వారినే అనుమానిస్తున్నారు: ఆనం

వైసిపి అధినేత జగన్ సొంత వారినే తెలుగుదేశం పార్టీ నేతలుగా అనుమానిస్తున్నారని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండిపడ్డారు. మన దేశంలో కవిడ్ ప్రోకోను జగన్ తన సొంతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అనేక రకమైన వింత వ్యాధులతో బాధపడుతున్నారన్నారు.

Also See: మరో రగడ... విభజనకు ముందే తీసుకుంటారా: తెలంగాణపై హైకోర్టు

సర్వే ఉద్దేశ్యాన్ని చెప్పాలి: మధు

స్మార్ట్ పల్స్ సర్వే ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించాలని, సంక్షేమ పథకాలకు కోత విధించేందుకే ప్రజలు భయపడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆఫకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP chief YS Jagan is guest artist in AP politics, says China Rajappa.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X