సోషల్ మీడియాలో అడుగుపెట్టిన వైయస్ జగన్
హైదరాబాద్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వేదిక ట్విట్టర్‌లోకి అడుగు పెట్టారు. @ysjagan అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఆయన ట్విట్టర్‌లో ప్రవేవించారు. ఇంతకాలం ప్రజల మధ్య ఉన్న ఆయన, నేరుగా వారితోనే సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ట్విట్టర్ ఖాతాను తెరిచినట్లు తెలుస్తోంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 9, 2015 దీంతో ప్రజలు, యువతీయువకులు, ఎన్నారైలు, ఇతరులెవరైనా వైయస్ జగన్మోహన్ రెడ్డితో తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, వివిధ అంశాలపై ఆయన తన మనోభావాలను వ్యక్తం చేయడానికి వేదికగా ఈ ట్విట్టర్ ఖాతా ఉపయోగపడనుంది. బుధవారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో ఈ ట్విట్టర్ ఖాతా తెరిచారు.

కాగా, వైయస్ జగన్ తన తొలి ట్వీట్‌లో ఏం చెప్పబోతున్నారనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ మీడియాలో కూడా అందుబాటులో ఉండాలన్న పార్టీ ముఖ్యుల సలహాను ఆయన ఇటీవలే అంగీకరించినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో ఖాతా తెరిచారు.












Click it and Unblock the Notifications