వైసీపీ సీనియర్ల నియోజకవర్గాల బాధ్యతల్లో మార్పులు - జగన్ మార్క్ నియామకాలు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి - వైసీపీ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వ నిర్ణయాల పైన పోరుబాట ప్రారంభించారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల ఓటమి తరువాత ఇప్పుడు నియోజకవర్గాల వారీగా జగన్ కో ఆర్డినేటర్ల నియామకాలు వేగవంతం చేసారు. ముఖ్య నేతల నియోజకవర్గాల్లోనూ మార్పులు చేసారు.
మాజీ సీఎం జగన్ 2024 ఎన్నికల ఫలితాలతో పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేసారు. నియోజక వర్గాల వారీగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను జగన్ నియమించారు. అదే విధంగా 2024 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దింపారు. కాగా, వారిలో చాలా మందిని తిరిగి సొంత నియోజకవర్గాలనే అప్పగించారు. ఇక.. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సీనియర్లతో పాటుగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు చేసారు. ఇక..సీనియర్ నేతల అంశం లోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా స్పీకర్ తమ్మినేనితో సహా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ బాధ్యతల్లోనూ మార్పులు చేసారు.

వైసీపీలో పలు కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో కొత్త సమన్వయకర్తలు, సభ్యులను నియమి స్తూ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గం సమన్వయకర్తగా వడ్డీ రఘురామ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం బాధ్యతలు చూసిన.. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ను పార్టీ పీఏసీ సభ్యుడిగా కొత్త బాధ్యతలు అప్పగించారు.
అదే విధంగా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాం ప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. అక్కడ ఉన్న పిరియా సాయిరాజ్ ను సీఈసీ సభ్యుడిగా నియమించారు. కాగా.. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ను నియమించారు. వచ్చే నెల నుంచి జగన్ కార్యకర్తలతో వరుసగా జిల్లాల వారీగా సమావేశాలకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు ఈ నెల 20న జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications