చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు-అసెంబ్లీలో మహిళా చర్చ-కుప్పం ఎఫెక్ట్ తో రాలేదంటూ
ఏపీ అసెంబ్లీలో ఇవాళ మహిళా సాధికారతపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముందుగా మహిళా ఎమ్మెల్యేలంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న పథకాలపై మాట్లాడారు. సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ తర్వాత చివర్లో ప్రసంగించిన సీఎం జగన్... మహిళా సాధికారత కోం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల్ని సుదీర్గంగా వివరించారు. అలాగే చంద్రబాబు అసెంబ్లీకి రాకపోవడంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలని దేవుడ్ని కోరారు.

అవ్వలకూ అక్కలకూ అమ్మఒడి, పెన్షన్
మహిళా సాధికారతపై ఇవాళ ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ చివరిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మహిళల కోసం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను గుర్తుచేశాలు. అక్కచెల్లెళ్లు బావుండాలనే మహిళా సాధికారతను ఓ ఉద్యమంగా, ఓ విప్లవంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మహిళలు ఎదగాలని ప్రభుత్వం గట్టిగా అడుగులు వేసిందన్నారు. మహిళా సాధికారిత చరిత్రలో ఈ రెండేళ్లలో ఓ సువర్ణాధ్యాయం లిఖించడం జరిగిందని జగన్ తెలిపారు. అమ్మఒడి ద్వారా 44.50 లక్షల తల్లులకు, 85 లక్షల మంది పిల్ల్ని బడులకు పంపితే చాలు రూ.15వేలు ఇస్తున్నామన్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక గురించి మాట్లాడుతూ గతంలో టీడీపీ సర్కారులో జన్మభూమి కమిటీలు టీడీపీ వారికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని జగన్ గుర్తు చేశారు. అదీ వెయ్యి రూపాయలు మాత్రమేనన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం రూ.2250 చొప్పున ఇస్తున్నామన్నారు. ఎవరినీ అడుక్కోకుండానే నేరుగా మహిళల ఖాతాల్లో పథకాల మొత్తాలు పడుతున్నాయని జగన్ తెలిపారు.

వైఎస్సార్ ఆసరా, చేయూత
నాలుగేళ్లలో అక్షరాలా 78 లక్షల 76 వేల మంది అక్కచెల్లెళ్లకు మేలు చేసే విధంగా వైఎస్సార్ ఆసరా పేరుతో రూ.25,517 కోట్లు మేలు చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. ఈ రెండేళ్లలో వీరికి రూ.12758 కోట్ల రూపాయలు నేరుగా అందించామన్నారు. సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.2354 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం సున్నావడ్డీ పథకం అమలు చేయకుండా మహిళల్ని గాలికొదిలేస్తే వారి సంఘాలు నిరర్ధక ఆస్తుల జాబితాలోకి వెళ్లాయన్నారు. అలాంటి పరిస్దితుల్లో వైఎస్సార్ ఆసరా పథకం వారికి ఆక్సిజన్ గా నిలిచిందన్నారు. వైఎస్సార్ చేయూతలో భాగంగా వరుసగా నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.18,750 ఇవ్వడం వల్ల మహిళలు ఆర్ధికంగా వ్యాపారంలో నిలదొక్కుకునే పరిస్ధితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే దీని కోసం దాదాపు రూ.9 వేల కోట్లు ఖర్చుపెట్టామని జగన్ తెలిపారు. దీంతో వీరు నెలకు రూ.7 వేల నుంచి రూ.17 వేలు సంపాదించుకునే అవకాశం దక్కిందన్నారు.

31 లక్షల ఇళ్ల పట్టాలు, 17 వేల కాలనీలు
రాష్ట్ర జనాభాలో నాలుగోవంతు మహిళలకు శాశ్వత ఇళ్ల కోసం ఇప్పటికే 31 లక్షల ఇట్టపట్టాలు ఇచ్చామని, అందులో 17 వేల కాలనీలు నిర్మిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఓసారి స్ధలంలో ఇళ్ల నిర్మాణం పూర్తయి రోడ్లు, డ్రైనేజీలు వస్తే ప్రతీ అక్కా చెల్లెమ్మ చేతిలో ఒక్కొక్కరి చేతిలో రూ.5 నుంచి రూ.10 లక్షలు వారి చేతిలో పెట్టినట్లని జగన్ తెలిపారు. దీని ద్వారా లక్ష కోట్ల రూపాయల సంపదను మహిళల చేతుల్లో పెట్టినట్లు జగన్ తెలిపారు. ఇలాంటి మంచి పథకాన్ని సైతం అడ్డుకునేందుకు కోర్టుల్ని ఆశ్రయించి ఆపాలని చూడటం ధర్మమేనా అని విపక్షాలను జగన్ ప్రశ్నించారు. అందుకే కుప్పంలో దేవుడు మొట్టికాయలు వేశాడని జగన్ తెలిపారు.

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన
18 లక్షల 80 వేల తల్లులకు రూ.5300 కోట్ల రూపాయలు జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అందించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న వసతి దీవెన కింద 17 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.2200 కోట్లువేసినట్లు జగన్ వెల్లడించారు. చదువుల ద్వారా పిల్లల తలరాతలు మార్చాలని ఓ పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగన్ తెలిపారు. అంగన్ వాడీల్ని ఫౌండేషన్, శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లుగా మారుస్తున్నట్లు, వాటి నుంచే ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నట్లు జగన్ తెలిపారు. ఇలా 30 లక్షల మందికి మేలు జరుగుతుందన్నారు. అలాగే సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కూడా అమలవుతోందన్నారు.

జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు
కాపు మహిళల కోసం కాపునేస్తం పథకం అమలు చేస్తున్నామని, అలాగే ఈబీసీ మహిళల కోసం కూడా ఈబీసీ నేస్తం పథకం అమల్లోకి తెస్తున్నట్లు జగన్ వెల్లడించారు. తన పాదయాత్ర పూర్తయిన జనవరి 9 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందన్నారు. మహిళల్ని మహరాణులుగా తీర్చిదిద్దేందుకు నామినేటెడ్ పదవుల్లో సగం ఇచ్చినట్లు తెలిపారు. తన కేబినెట్లో సైతం ఓ చెల్లెలికి హోంమంత్రిగా మరో డిప్యూటీ సీఎం, మరో మంత్రి పదవిని కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా సైతం ఓ మహిళను రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నియమించడం జరిగిందన్నారు. కార్పోరేషన్ల ఛైర్మన్లు, డెరెక్టర్ల పదవుల్లోనూ సగం మహిళలకే ఇచ్చామన్నారు. పట్టణ స్ధానిక సంస్ధల్లో మేయర్లు, ఛైర్మన్ల పదవుల్ని సైతం సగమిచ్చామన్నారు.

మహిళల భద్రత కోసం దిశ
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. మన చేతుల్లో ఉన్న మేరకు దిశ చట్టం చేసి కేంద్రానికి పంపామన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నట్లు తెలిపారు. దిశ పోలీసు స్టేషన్లు, కోర్టులు, ప్రత్యేక ప్రాసిక్యూటర్లను, ఫోరెన్సిక్ ల్యాబ్ లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు జగన్ వెల్లడించారు. ప్రతీ జిల్లాకూ ఓ ప్రత్యేక దిశ కోర్టు తెచ్చేందుకు ఛీఫ్ జస్టిస్ ను అడుగుతున్నట్లు జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ ను 90 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. ఇప్పటిదాకా దిశ యాప్ ద్వారా 6వేల మందిని పోలీసులు కాపాడారని తెలిపారు. లాభాపేక్ష లేకుండా బెల్ట్ షాపులు తీసేసి నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. మద్యం దుకాణాల సంఖ్య కూడామూడోవంతుకు తగ్గించామన్నారు. మహిళలపై నేరాల అదుపుకు మహిళా పోలీసుల్ని గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులో ఉంచామన్నారు.
Recommended Video

జగన్ చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
బీఏసీ సమావేశంలో మహిళా సాధికారతపై చర్చకు ప్రతిపాదించినప్పుడు చంద్రబాబు కూడా వస్తారని అచ్చెన్నాయడు చెప్పారని జగన్ తెలిరారు.. దీంతో ఆయన వస్తారని ఎదురుచూశామని, కానీ చర్చను ఆలస్యం చేసినా ఆయన మాత్రం కనిపించలేదన్నారు. ఆయనకున్న కష్టమేమిటో తెలియదని జగన్ అన్నారు. తమ వాళ్లు మాత్రం కుప్పం ఎఫెక్ట్ అని చెప్పారని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబుకు ఇప్పటికైనా మహిళల విషయంలో ఆయనకూ, తమకు తేడా తెలిస్తే మంచిదని జగన్ తెలిపారు. మహిళలకు ఇళ్ల పట్టాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నందుకు జ్ఞానోదయం అవుతుందని భావిస్తున్నాన్నారు. నిన్నటి మున్సిపల్ ఫలితాల్ని గుర్తు చేస్తూ 97 శాతం ఫలితాలు సాధించామని జగన్ తెలిపారు. నగర పంచాయతీల్లో సైతం 57 శాతం ఓటు శాతం సాధించినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా టీడీపీ నిర్మాణాత్మక విపక్షంగా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబుకు జగన్ తెలిపారు. ప్రతీసారి కోర్టుల ద్వారా ప్రజల్ని ఇబ్బందిపెట్టకుండా చంద్రబాబు ఉంటారనే ఇవన్నీ చెప్తునట్లు జగన్ పేర్కొన్నారు. ఈ చర్చలో చంద్రబాబు ఉంటే బావుంటుందని అన్నారు. టీవీల్లో ఈ చర్చను చూసైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందేమో అన్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications