జగన్ ఊహించని నిర్ణయం,ఇక సమరమే - కూటమి కంచుకోటలో..!!

మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. ఎన్నికల్లో పరాజయం తరువాత 11 సీట్లకే పరిమితం కావటం పైన సమీక్ష చేసారు. పొరపాట్లు సరి చేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావటంతో ఇక జిల్లాల పర్యటనలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత గురించి ప్రతీ సందర్భంలో వివరిస్తున్నారు. ఇప్పుడు కీలక సమావేశాలకు జగన్ డిసైడ్ అయ్యారు. ఈ సమయంలోనే తొలి సారిగా అనూహ్య నిర్ణయం ప్రకటన చేయనున్నారు.

ys-jagan-key-decision-ahead-districts-tour-details-here

అనూహ్య నిర్ణయం
2024 ఎన్నికల్లో ఓటమి తరువాత మారాల్సిందేనని జగన్ నిర్ణయించారు. ఎన్నికల్లో ఓటమికి గల ప్రతీ కారణం పైన విశ్లేషించారు. పొరపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. అందు లో భాగంగా పార్టీ కేడర్ కు ప్రాధాన్యత ఉంటుందని ప్రతీ సమావేశంలో చెబుతూ విశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పీఏసీతో పాటుగా జిల్లాలు.. అనుబంధ కమిటీలను ఖరారు చేసారు. ఇప్పుడు రేపటి నుంచి వరుసగా రెండు రోజుల పాటుగా పీఏసీ సభ్యులు, ప్రాంతీయ సమ న్వయ కర్తలతో జగన్ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసారు. ఈ భేటీలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం.. కార్యకర్తలతో మమేకం.. ప్రభుత్వం పైన పోరుబాట.. కేడర్ కోసం తీసుకోవాల్సి న నిర్ణయాల పైన సమీక్ష చేయనున్నారు.

Take a Poll

సభ్యత్వం - ఇన్సూరెన్స్
ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో తన నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. చాలా కాలంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని సీనియర్లు సూచిస్తున్నారు. ప్రతీ ఏటా పార్టీ ప్లీనరీ.. సభ్యత్వ నమోదు కొనసాగించాలని అప్పట్లోనే ప్రతిపాదన వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలోనూ పార్టీ సభ్యత్వం పైన జగన్ నిర్ణయం తీసుకోలేదు. ఇతర పార్టీల్లో సభ్యత్వ నమోదుతో పాటుగా సభ్యత్వం తీసుకున్న వారికి భీమా సదుపాయం కల్పిస్తున్నారు. వైసీపీలో మాత్రం అమలు కావటం లేదు. దీంతో, పార్టీని తిరిగి క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే క్రమంలో పార్టీ సభ్యత్వం.. భీమా సదుపాయం ఇతర పార్టీల కంటే ఎక్కువ మొత్తం అందేలా నిర్ణయించారు. దీనికి సంబంధించి సభ్యత్వ రసుము.. ఆరోగ్య భీమా ఎంత మేర ఇవ్వాలనేది రేపు (మంగళవారం) జరిగే పార్టీ పీఏసీ సమావేశంలో చర్చించి తుది ఆమోద ముద్ర వేయనున్నారు.

పార్టీ ప్లీనరీ ద్వారా
ఓడిన తరువాత పార్టీలో నిస్తేజం తెలిగించేందుకు పార్టీ ప్లీనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశం పైన ఈ రెండు రోజు సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో అందుబా టులో ఉంటున్నారు. మిగిలిన కాలం బెంగళూరుకు వెళ్తున్నారు. జూలై 8, 9 తేదీల్లో ప్లనరీ నిర్వహణ ద్వారా తన జిల్లాల పర్యటనలు.. పార్టీ కార్యాచరణ పైన జగన్ దిశా నిర్దేశం చేయాలని భావిస్తున్నారు. మే లో కడప కేంద్రంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తుండటంతో.. గోదావరి జిల్లాల్లో ప్లీనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. జగన్ సైతం ఇక కూటమి తో పోరాటానికి సై అనేందుకు సిద్దమయ్యారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల పైన ఇప్పుడు వైసీపీలో ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+