Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆదాయశాఖలపై జగన్ సమీక్ష- మార్గాలు సూచించిన సీఎం- కీలక ఆదేశాలివే..

రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న పలు శాఖలపై సీఎం వైయస్‌.జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ, పర్యావరణశాఖ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తాజా వివరాలు అందజేశారు. వీటిని సమీక్షించిన జగన్.. వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

 ఆదాయశాఖలపై జగన్ సమీక్ష

ఆదాయశాఖలపై జగన్ సమీక్ష

పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలుపై సీఎం సమీక్ష చేశారు. పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా, ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ వారికి సూచించారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని కూడా జగన్ సూచించారు.

 ఆదాయశాఖలపై జగన్ సమీక్ష

ఆదాయశాఖలపై జగన్ సమీక్ష

పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలుపై సీఎం సమీక్ష చేశారు. పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా, ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ వారికి సూచించారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని కూడా జగన్ సూచించారు.

 ఎక్సైజ్ సమీక్ష

ఎక్సైజ్ సమీక్ష

ఎక్సైజ్‌ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని అధికారుల్ని సీఎం జగన్ కోరారు. బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర అని ఆయన అన్నారు. దీనిపై గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి ఒక ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలన్నారు.

 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపైనా సీఎం జగన్ సమీక్ష చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్‌ పెట్టాలని సీఎం ఆదేశించారు. 14400 ఏసీబీ నెంబరుతో పోస్టర్‌లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్పష్టంగా కనిపించేలా ఈ నెంబరుపోస్టర్‌ను డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నెంబరు డిస్‌ప్లే చేయాలన్నారు. పటిష్టమైన చర్యలు ద్వారానే అవినీతిని రూపుమాపగలుగుతామన్నారు. 14400 ఫోన్‌ కాల్స్‌ను రిసీవ్‌ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టుపై కూడా పక్కాగా ఉండాలని సీఎం కోరారు.

 సచివాలయపై సమీక్ష

సచివాలయపై సమీక్ష

గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది పోస్టర్ల రూపంలో డిస్‌ప్లే చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్నారు. అప్పుడే ప్రజలు ముందుకు వస్తారన్నాకు. 51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.
మరో 650 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వీటికి అదనంగా 2వేల గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం అక్టోబరు2, 2022 నాటికి సిద్ధం చేస్తామని కూడా సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన జగన్.. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

 అటవీ, పర్యావరణ సమీక్ష

అటవీ, పర్యావరణ సమీక్ష

అనంతరం అటవీ పర్యావరణ శాఖపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. త్వరలోనే ఎర్రచందనం వేలం- గ్లోబల్‌ టెండర్‌ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయని అధికారులు జగన్ కు తెలిపారు. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ను భద్రపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ప్రతి నెలా స్టాక్‌కు సంబంధించిన వివరాలు చెక్‌ చేసుకుంటూ... వివరాలు నమోదు చేయాలన్నారు. పక్కాగా స్టాక్‌ వెరిఫికేషన్‌ చేయాలన్నారు. చివరిగా అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంపైనా సీఎం సమీక్ష చేశారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.905.57 కోట్ల డబ్బును చెల్లించిందన్న సీఎం.. అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారుల్ని ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+